Chit Fund Fraud : ఏం తెలివి..! సంక్రాంతికి పప్పుల పేరుతో విజయనగరంలో ఘరానా మోసం.. లక్షల రూపాయలతో చిట్టీల వ్యాపారి పరార్

సంక్రాంతి పండక్కి పప్పులు ఇస్తాం అంటూ సామాన్యులను ఊరించి ఊరడించి లక్షల రూపాయలతో ఉడాయించాడో మోసగాడు. తన సమీప బంధువు అయిన ఓ మహిళా వాలంటీర్ ను ఎరగా చూపి ఆమె ద్వారా లక్షలాది రూపాయలను దండుకుని బిచానా ఎత్తేశాడు ఆ మోసగాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేట గ్రామంలో వెలుగు చూసిందీ మోసం.

Chit Fund Fraud : ఏం తెలివి..! సంక్రాంతికి పప్పుల పేరుతో విజయనగరంలో ఘరానా మోసం.. లక్షల రూపాయలతో చిట్టీల వ్యాపారి పరార్

Chit Fund Fraud : సంక్రాంతి పండక్కి పప్పులు ఇస్తాం అంటూ సామాన్యులను ఊరించి ఊరడించి లక్షల రూపాయలతో ఉడాయించాడో మోసగాడు. తన సమీప బంధువు అయిన ఓ మహిళా వాలంటీర్ ను ఎరగా చూపి ఆమె ద్వారా లక్షలాది రూపాయలను దండుకుని బిచానా ఎత్తేశాడు ఆ మోసగాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేట గ్రామంలో వెలుగు చూసిందీ మోసం.

ఎస్ఎస్ ఆర్ పేట గ్రామానికి చెందిన పతివాడ శ్రీలేఖ నెల్లిమర్ల మండలం సచివాలయంలో వాలంటీర్ గా పని చేస్తోంది. ఆమెకు సమీప బంధువైన కొండకరకాం గ్రామస్తుడు మజ్జి అప్పల్రాజు భాగస్వామ్యంతో సంక్రాంతికి పప్పులు అందజేస్తాం అంటూ ఓ చిట్టీ వ్యాపారం ప్రారంభించింది. ఒక్కొక్కరి దగ్గర నెలకు రూ.300 చొప్పున వసూలు చేసింది శ్రీలేఖ. నెల నెల రూ.300 చెల్లిస్తే సంక్రాంతికి పండుగ పిండి వంటలకు సరిపడ సరుకులు ఒకేసారి తీసుకోవచ్చని ఆకర్షితులయ్యారు గ్రామస్తులు.

Also Read..Warangal Chit Fund Fraud : వరంగల్‌లో ఘరానా మోసం… రూ.40 కోట్లతో చిట్టీ వ్యాపారి ఉడాయింపు

ఇలా ఒకరి నుంచి ఒకరికి ఈ సులభ వాయిదాల పథకం సులువుగా ప్రచారమైంది. తక్కువ మొత్తమే కదా అని వేలాది మంది వీళ్ల వ్యాపారంలో చేరారు. ఇలా శ్రీలేఖ వ్యాపారం ప్రతి నెల పెరుగుతూ పోయింది. నెల నెల దండిగా డబ్బు వసూలు అవుతూ ఉండటంతో తమ వ్యాపారం మరింత అభివృద్ధి చేసేందుకు ఏజెంట్లను సైతం నియమించుకున్నారు శ్రీలేఖ, అప్పల్రాజులు.

ఏజెంట్లు, చిట్టీల వ్యాపారంలో సభ్యులు నెల నెల పెరుగుతూ పోయారు. అయితే, శ్రీలేఖ చిట్టీల వ్యాపారంలో కొందరు క్రిస్టియన్లు కూడా ఉన్నారు. వీరంతా సంక్రాంతికి కాకుండా తమకు క్రిస్ మస్ కు లేదా నూతన సంవత్సర వేడుకులకు పండుగ సరుకులు ఇవ్వాల్సిందిగా ఏజెంట్లను కోరారు. సభ్యులు భారీగా ఉండటంతో డిమాండ్లు రోజురోజుకి ఎక్కువయ్యాయి. ఏజెంట్లు, సభ్యుల ఒత్తిడితో అప్పల్రాజు నిజ స్వరూపం బయటపడింది. సరుకులు రేపు మాపు ఇస్తామని చెబుతూ వచ్చిన అప్పల్రాజు క్రిస్ మస్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు.

Also Read.. Sahiti Infratec Scam : తక్కువ ధరకే ప్లాట్లు, ఎగబడిన జనం.. కట్ చేస్తే ఘరానా మోసం, రూ.900 కోట్ల రియల్ స్కామ్

రేపు మాపు అని తప్పించుకుని తిరిగిన అప్పలరాజు చివరికి ఎస్కేప్ అయ్యాడు. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు లబోదిబోమన్నారు. బాధితులంతా శ్రీలేఖ ఇంటిముందు ఆందోళనకు దిగారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.