Sahiti Infratec Scam : తక్కువ ధరకే ప్లాట్లు, ఎగబడిన జనం.. కట్ చేస్తే ఘరానా మోసం, రూ.900 కోట్ల రియల్ స్కామ్

సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీ లాంచ్ పేరుతో 900 కోట్ల రూపాయల మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు.

Sahiti Infratec Scam : తక్కువ ధరకే ప్లాట్లు, ఎగబడిన జనం.. కట్ చేస్తే ఘరానా మోసం, రూ.900 కోట్ల రియల్ స్కామ్

Sahiti Infratec Scam : తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని ప్రకటనలతో ఊరించారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఆశలు కలిగించారు. ఇది నమ్మిన జనం.. డబ్బు కట్టారు. ఏకంగా 2వేల 500 నుంచి సుమారు రూ.900 కోట్లు వసూలు చేశారు. కట్ చేస్తే.. ఇది ఘరానా మోసం అని తేలింది. ఇది రియల్ చీటింగ్, భారీ స్కామ్ అని తెలిసి కస్టమర్లు లబోదిబోమన్నారు. ఇదీ.. సాహితీ ఇన్ ఫ్రా టెక్ పాల్పడిన భారీ మోసం.

హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ స్టేషన్ కు సాహితీ ఇన్ ఫ్రా బాధితులు భారీగా చేరుకుంటున్నారు. నిన్న సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీ లాంచ్ పేరుతో 900 కోట్ల రూపాయల మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట ప్లాట్లు ఇస్తామని భారీ మొత్తంలో డబ్బు సేకరించి కస్టమర్లను నిండా ముంచాడు సాహితీ ఇన్ ఫ్రా టెక్ వెంచర్స్ ఎండీ, టీటీడీ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దర్యాఫ్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు.. గతంలోనే ఆయనపై కేసులు నమోదు చేసినట్లు గుర్తించారు. నిన్న ఆయనను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దీంతో బూదాటి లక్ష్మీనారాయణ.. టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేశారు.

హైదరాబాద్ శివారు అమీన్ పూర్ గ్రామంలో సాహితీ శరవణి ఎలైట్ పేరిట 23 ఎకరాల్లో 38 అంతస్తులతో 10 అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు. అయితే, వీటికి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. 1200 నుంచి 1500 చదరపు అడుగుల వైశాల్యంలో డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్లు ఉన్నాయని, ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ వినియోగదారులను ఆకర్షించారు. 1500 మందికి పైగా వినియోగదారుల నుంచి రూ.539 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read.. Sankalp Siddhi Mart : వస్తువులు కొంటే డబ్బు రిటర్న్.. విజయవాడలో ఘరానా మోసం.. రూ.1500 కోట్ల కుంభకోణం

ప్రాజెక్ట్ విఫలం కావడంతో డబ్బు తిరిగివ్వాలని బాధితులు ఆందోళనకు దిగారు. వడ్డీ సహా డబ్బు తిరిగిస్తామని లక్ష్మీనారాయణ చెప్పారు. కానీ, కొందరికి ఇచ్చిన చెక్కులు చెల్లలేదు. అదే సమయంలో ప్రగతినగర్, బొంగులూరు, కాకతీయ హిల్స్, అయ్యప్ప సొసైటీ, కొంపల్లి, శామీర్ పేట్ లోనూ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నట్లు అనౌన్స్ చేశారు సాహితీ ఇన్ ఫ్రా టెక్ ఎండీ లక్ష్మీనారాయణ.

తక్కువ ధరకే ఇళ్లను సొంతం చేసుకోవచ్చు అంటూ అక్కడ కూడా ప్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటించారు. ఇక అక్కడ కూడా భారీగా బుకింగ్ లు చేయించాడు. అలా మొత్తం 2వేల 500మంది నుంచి 900 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్ట్ మొదలు కాకపోవడం, డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో మాదాపూర్, జూబ్లీహిల్స్, పేట్ బషీర్ బాద్, బాచుపల్లి పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదులు చేశారు.

Also Read..Cyber Criminals Fraud : పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం.. రూ.కోటి 33 లక్షలు కొట్టేశారు

అటు అమీన్ పూర్ లో ప్లాట్ల పేరుతో తమను మోసం చేశారంటూ లక్ష్మీనారాయణపై జూలై 31 సీసీఎస్ లోనూ బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాఫ్తు చేసిన పోలీసులు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. లక్ష్మీనారాయణ బాధితుల్లో ఎన్ఆర్ఐలు, డాక్టర్లు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు.