Sankalp Siddhi Mart : వస్తువులు కొంటే డబ్బు రిటర్న్.. విజయవాడలో ఘరానా మోసం.. రూ.1500 కోట్ల కుంభకోణం

విజయవాడలో ఘరానా మోసం ఒకటి వెలుగుచూసింది. వస్తువులు కొనుగోలు చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయంటూ భారీ మొత్తంలో ఖాతాదారులను చేర్చుకుని జనాన్ని బురిడీ కొట్టించినట్లు సంకల్ప్ సిద్ధి సంస్థపై ఆరోపణలు వచ్చాయి.

Sankalp Siddhi Mart : వస్తువులు కొంటే డబ్బు రిటర్న్.. విజయవాడలో ఘరానా మోసం.. రూ.1500 కోట్ల కుంభకోణం

Updated On : November 23, 2022 / 11:53 PM IST

Sankalp Siddhi Mart : విజయవాడలో ఘరానా మోసం ఒకటి వెలుగుచూసింది. వస్తువులు కొనుగోలు చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయంటూ భారీ మొత్తంలో ఖాతాదారులను చేర్చుకుని జనాన్ని బురిడీ కొట్టించినట్లు సంకల్ప్ సిద్ధి సంస్థపై ఆరోపణలు వచ్చాయి.

తమతో పాటు మరో ఇద్దరిని ఖాతాదారులుగా చేర్పిస్తే కమీషన్ ఇస్తామంటూ ఆశ చూపి ఆన్ లైన్ ద్వారా వేలాది మందిని చేర్చుకుంది ఆ సంస్థ. ప్రారంభించిన కొద్ది నెలల్లోనే మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసింది. దాదాపు రూ.1500 కోట్ల వరకు సంకల్ప సిద్ధి మార్ట్ లో టర్నోవర్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.

బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసి సంస్థ నిర్వహాకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు కోరారు.

రూ.10వేలు కడితే 300 రోజుల్లో రూ.30వేలు ఇస్తామని మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా ఎర వేసింది. లక్ష రూపాయలు చెల్లిస్తే 300 రోజుల్లో 3లక్షల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో సంస్థ ప్రచారాన్ని నమ్మిన ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆ సొమ్మును సంస్థ నిర్వాహాకులు రియల్ ఎస్టేట్, మైనింగ్ లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంస్థ కార్యకలాపాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు.