Cyber Criminals Fraud : పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం.. రూ.కోటి 33 లక్షలు కొట్టేశారు

ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని ఊరిస్తుంటారు సైబర్ నేరగాళ్లు. వారి వలలో చిక్కుకున్నామో అంతే సంగతి. అసలుకే ఎసరొస్తుంది. ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. నడిరోడ్డున పడాల్సి వస్తుంది. సరిగ్గా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది.

Cyber Criminals Fraud : పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం.. రూ.కోటి 33 లక్షలు కొట్టేశారు

Cyber Criminals Fraud : ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని ఊరిస్తుంటారు సైబర్ నేరగాళ్లు. వారి వలలో చిక్కుకున్నామో అంతే సంగతి. అసలుకే ఎసరొస్తుంది. ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. నడిరోడ్డున పడాల్సి వస్తుంది. సరిగ్గా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా కోటి రూపాయల 33లక్షలు కాజేశారు సైబర్ క్రిమినల్స్. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో రెండు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి.

క్రిప్టోలో ట్రేడింగ్ పెట్టుబడి పెడితే మీకు తిరుగుండదు. లాభాలే లాభాలు అంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువతిలో లేనిపోని ఆశలు రేపారు సైబర్ నేరగాళ్లు. చైనాకు చెందిన క్రిప్టో ట్రేడర్ గా ఇన్ స్టాలో పరిచయం చేసుకున్న చీటర్స్.. ఆ యువతిని నమ్మించి మోసం చేశారు. వారి మాటలు నమ్మిన యువతి గుడ్డిగా రూ.91లక్షలు ఇన్వెస్ట్ చేసింది. ఇంకేంముంది భారీ మొత్తం చేతిలోకి రావడంతో స్వాహా చేసేశారు సైబర్ క్రిమినల్స్. సైబర్ చీటర్స్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో, డబ్బు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన యువతి లబోదిబోమంది. తనకు న్యాయం చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక, మరో కేసులో.. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో సుల్తాన్ బజార్ కి చెందిన యువకుడికి భారీ టోకరా వేశారు సైబర్ చీటర్స్. ఆ యువకుడి నుంచి 42లక్షల రూపాయలు కాజేశారు. భారీ లాభాలు వస్తాయని నమ్మించడంతో ఆ యువకుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గుండెలు బాదుకున్నాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రెండు కేసులు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ టీమ్.. దర్యాఫ్తును వేగవంతం చేసింది.