Dead Body In Drum : పరువు పోతుందనే భయంతో.. విశాఖలో శ్రద్ధా వాకర్ తరహా హత్య కేసులో వీడిన మిస్టరీ

విశాఖలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ తరహా హత్య కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. డ్రమ్ లో డెడ్ బాడీ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు.. హంతకుడు ఎవరు? ఎందుకీ మర్డర్ చేశాడు? అనేది కనుగొన్నారు. డెడ్ బాడీని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి ధనలక్ష్మిదిగా పోలీసులు గుర్తించారు. రిషి అనే వ్యక్తి ఆమెను హత్య చేసినట్టు తేల్చారు.

Dead Body In Drum : పరువు పోతుందనే భయంతో.. విశాఖలో శ్రద్ధా వాకర్ తరహా హత్య కేసులో వీడిన మిస్టరీ

Dead Body In Drum : విశాఖలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ తరహా హత్య కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. డ్రమ్ లో డెడ్ బాడీ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు.. హంతకుడు ఎవరు? ఎందుకీ మర్డర్ చేశాడు? అనేది కనుగొన్నారు. వివాహేతర సంబంధమే ఈ మర్డర్ కు కారణం అని పోలీసులు నిర్ధారించారు. డెడ్ బాడీని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి ధనలక్ష్మిదిగా గుర్తించారు. రిషి అనే వ్యక్తి ఆమెను హత్య చేసినట్టు తేల్చారు.

ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. శ్రీకాకుళం బస్టాండ్ లో రిషి, ధనలక్ష్మి మధ్య పరిచయం ఏర్పడింది. ధనలక్ష్మిని రిషి మధురవాడ తీసుకొచ్చాడు. అక్కడి వారికి తన భార్య అని చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత ధనలక్ష్మి.. రిషిని డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బు ఇచ్చేందుకు రిషి నిరాకరించాడు. దీంతో ఆమె గొడవ చేస్తానని బెదిరించింది. ఈ గొడవ పెద్దదైతే అందరికీ తెలుస్తుందని, తన పరువు పోతుందని భావించి ధనలక్ష్మి మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని ఓ వాటర్ డ్రమ్ములో ఉంచి అద్దె ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిందని, ఆమె వచ్చాక ఇంటి అద్దె చెల్లిస్తానని ఇంటి యజమానికి చెప్పాడు.

Also Read..Medico Tapasvi Case : ప్రాణం తీసిన ప్రేమ.. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన తపస్వి స్వగ్రామంలో తీవ్ర విషాదం

ఈ విధంగా ఏడాది గడిచింది. అయినా రిషి తిరిగి రాలేదు. దీంతో ఇంటిని ఖాళీ చేయించేందుకు యజమాని రమేశ్ వెళ్లాడు. తాళాలు పగలగొట్టి డోర్ తెరిచాడు. ఇంటిని శుభ్రం చేస్తుండగా.. ఓ డ్రమ్ నుంచి దుర్వాసన వచ్చింది. డ్రమ్ములో చూడగా మృతదేహం కనిపించడంతో షాక్ తిన్నాడు. వెంటనే ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. రిషిపైనే అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా.. ఈ దారుణం వెలుగుచూసింది.

ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ హత్య చేసి మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి, అనంతరం వాటిని వివిధ ప్రదేశాల్లో పారవేసిన ఘటన కలకలం రేపింది. ఇది మరువక ముందే ఏపీలోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది. మహిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని ఏడాది పాటు డ్రమ్ములో దాచిన విషయం బయటపడింది. విశాఖపట్నంలోని మధురవాడ వికలాంగుల కాలనీలో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

డ్రమ్ లో డెడ్ బాడీ వ్యవహారం విశాఖలో సంచలనం రేపింది. డ్రమ్ములో దొరికిన డెడ్ బాడీ ఎవరిది? ఆమెను ఎవరు చంపారు? ఎందుకు మర్డర్ చేశారు? అనేది మిస్టరీగా మారింది. 48 గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసులో మిస్టరీని చేధించారు.

Also Read..Wife Killed Husband : వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్తకు విషం కలిపిన అన్నం ఇచ్చి చంపిన భార్య

ఈ కేసు వివరాలను విశాఖ సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. ”ఈ నెల 4న రమేశ్ అనే వ్యక్తి మాకు ఫిర్యాదు చేశాడు. తన ఇంటిని రిషి అనే వ్యక్తికి 2020లో అద్దెకిచ్చినట్లు తెలిపాడు. రిషి, అతడి భార్య ఉన్నారని చెప్పాడు. 2021 జనవరిలో తన భార్యకు ప్రసవం గురించి రిషి తన భార్యను సొంతూరు శ్రీకాకుళం తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తాళం వేసి ఉంది.

ఇంట్లో ఎవరూ లేకపోయినా.. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుండటంతో.. ఇంటి ఓనర్ కు డౌట్ వచ్చింది. జూన్ లో వెళ్లి చూడగా.. ఇంటి వెనుక తలుపు తెరిచి ఉన్నట్లు గుర్తించాడు. దాంతో ఆయన ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. అప్పటి నుంచి రిషికి.. ఓనర్ రమేశ్.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరిగా స్పందించలేదు. అంతేకాదు ఇల్లు ఖాళీ కూడా చెయ్యలేదు. దీంతో ఓనర్ రమేశ్ ఈ నెలలో ఇంటికి వెళ్లాడు.

ఇంట్లోని సామాను తొలగిస్తున్న క్రమంలో ఓ మూలన సీల్ వేసి ఉన్న వాటర్ డ్రమ్ కనిపించింది. అది ఓపెన్ చూసి చూడగా అందులో మహిళ శవం కనిపించింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Dead body In Drum : డ్రమ్‌లో డెడ్ బాడీ.. విశాఖలో సంచలనం రేపిన కేసులో వీడిన మిస్టరీ

రిషి ఏడాదిన్నరగా కనిపించకపోవడం, మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం.. రిషిపై అనుమానం పెంచాయి. రిషిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. 2021 మే నెలలో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నంకు వస్తుంటే.. బస్టాండ్ లో రిషికి ఓ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత రాత్రికి వచ్చి రిషితో గడిపింది.

మరుసటి రోజు రిషిని డబ్బులు డిమాండ్ చేసింది. తాను డబ్బు ఇవ్వలేను అని రిషి చెప్పడంతో.. తాను గొడవ చేస్తానని ఆ మహిళ బెదిరించింది. ఆమె గొవడ చేస్తే విషయం బయటకు వస్తుందని, తన భార్యకు తెలుస్తుందని, తన పరువు పోతుందని భయపడ్డ రిషి.. ఆ మహిళను కొట్టాడు. ఆ తర్వాత ఆమె చున్నీతోనే ఆమె మెడకు బిగించి చంపేశాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తర్వాత ఇంట్లో ఉన్న దుప్పటిలో డెడ్ బాడీని చుట్టాడు. ఆ డెబ్ బాడీని వాటర్ డ్రమ్ లో ఉంచి దాన్ని సీల్ చేసి వెళ్లిపోయాడు. మొబైల్ నెంబర్ ఆధారంగా మృతురాలి పేరు ధనలక్ష్మి అని తెలిసింది. క్షణికావేశంలో రిషి ఈ మర్డర్ చేశాడు” అని విశాఖ సీపీ శ్రీకాంత్ తెలిపారు.