Dead body In Drum : డ్రమ్‌లో డెడ్ బాడీ.. విశాఖలో సంచలనం రేపిన కేసులో వీడిన మిస్టరీ
విశాఖ కొమ్మాది వికలాంగుల కాలనీలో నీళ్ల డ్రమ్ములో మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఇంటిని అద్దెకి తీసుకున్న రిషి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Dead body In Drum : విశాఖ జిల్లా మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొమ్మాది వికలాంగుల కాలనీలో నీళ్ల డ్రమ్ములో మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఇంటిని అద్దెకి తీసుకున్న రిషి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తి ఏడాదిన్నరగా అడ్రస్ లేకుండా పోవడంతో తాళం తీసిన ఇంటి యజమాని రమేశ్.. డ్రమ్ లో అస్థిపంజరం గుర్తించారు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. 24 గంటలలోపే నిందితుడిని పట్టుకున్నారు.
2020లో ఇంటి యజమాని రమేశ్.. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రిషి అనే వ్యక్తికి ఇంటిని అద్దెకు ఇచ్చాడు. నగరంలో వెల్డింగ్ పనులు చేసుకుంటూ భార్యతో కలిసి రెండు నెలలు పాటు ఆ ఇంట్లో ఉన్నాడు రిషి. 2021 జూలైలో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. భార్యను ప్రసవానికి తీసుకెళ్తున్నట్లు ఇంటి ఓనర్ కి చెప్పాడు. అలా వెళ్లిపోయిన రిషి.. ఎన్ని రోజులు అయినా తిరిగి రాలేదు. అద్దె కూడా చెల్లించకపోవడంతో ఇంటిని మరొకరికి అద్దెకిద్దామని తాళం తీయించాడు ఇంటి యజమాని రమేశ్.
ఇంటిని శుభ్రం చేస్తుండగా.. ఓ మూలన ఉన్న 200 లీటర్ల వాటర్ డ్రమ్ ను ఓపెన్ చేస్తే అందులో పుర్రె, ఎముకలు, పొడవాటి శిరోజాలు కనిపించాయి. దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు.. అద్దెకు తీసుకున్న రిషిపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఓనర్ తో ఫోన్ చేయించిన పోలీసులు.. అతడు ఎక్కడున్నది ఆరా తీశారు.
అయితే, తన భార్య, బిడ్డతో వేరే చోట ఉన్నట్లు ఫొటో కూడా పంపాడు రిషి. దీంతో డెడ్ బాడీ రిషీ భార్యది కాదని నిర్ధారించుకున్న పోలీసులు.. అసలు మృతదేహం ఎవరిది అన్న కోణంలో దర్యాఫ్తు చేసి వివరాలు రాబట్టారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ మృతదేహంగా గుర్తించారు. అసలు మహిళ అక్కడికి ఎందుకు వచ్చింది? నిందితుడితో ఏంటి సంబంధం? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు పోలీసులు.
కొమ్మాదికి చెందిన రమేష్.. వికలాంగుల కాలనీలో ఐదేళ్ల కిందట ఒక రేకుల షెడ్డును కొనుగోలు చేశాడు. 2019లో శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రిషికి ఆ ఇంటిని అద్దెకిచ్చాడు. రిషి నగరంలో వెల్డింగ్ పనులు చేసుకుంటూ, రమేష్ దగ్గర పనికి వచ్చేవాడు. అద్దెకు తీసుకున్న తర్వాత భార్యతో కలిసి ఆ ఇంట్లో ఉండేవాడు. 2021 జూలైలో భార్యను ప్రసవానికి తీసుకువెళుతున్నట్టు ఇంటి యజమానికి చెప్పి వెళ్లాడు రిషి. నెలలు గడిచినా రిషి రాకపోవడం, అద్దె చెల్లించకపోవడంతో రమేష్ ఇంటి తాళం తీయించాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఇంటిని శుభ్రం చేస్తున్న క్రమంలో 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ము నుంచి దుర్వాసన వచ్చింది. అందులో ఏముందా? అని చూడగా.. అతడు షాక్ తిన్నాడు. డ్రమ్ములో పొడవాటి జుట్టు, మనిషి ఎముకలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రమ్ములో అస్థిపంజరం బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.