Nara Lokesh : కొత్త డిమాండ్లు పెట్టడం లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేయండి

తాము కొత్త డిమాండ్లు పెట్టడం లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వెల్లడించారు. సీఎం జగన్ రెడ్డి మాటలు, చేతలు కోటలు దాటుతున్నాయని...

Nara Lokesh : కొత్త డిమాండ్లు పెట్టడం లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేయండి

Nara Lokesh

Updated On : March 28, 2022 / 7:07 PM IST

Nara Lokesh Comments : తాము కొత్త డిమాండ్లు పెట్టడం లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వెల్లడించారు. సీఎం జగన్ రెడ్డి మాటలు, చేతలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. బస్సు ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అప్పుడు చెప్పింది ఏమిటీ ? ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో చెబుతున్నది ఏంటీ ? అని సూటిగా ప్రశ్నించారు. 2022, మార్చి 28వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More : Nara Lokesh : పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోంది-నారా లోకేశ్

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వడమేమిటి? కనీసం రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా బాకరపేట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.