Andhra Pradesh Heavy Rains : మండుటెండల నుంచి బిగ్ రిలీఫ్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు

మండుటెండలతో, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు రిలీఫ్ దక్కింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Andhra Pradesh Heavy Rains : మండుటెండల నుంచి బిగ్ రిలీఫ్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు

Ap Rains

Andhra Pradesh Heavy Rains : మండుటెండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడిపోతున్న ఏపీ ప్రజలకు రిలీఫ్ దక్కింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు ముందే అండమాన్ తీరాన్ని తాకాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Rains (4)

Rains (4)

ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. కర్నూలు, కడప, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రొద్దుటూరు, బద్వేల్, గుత్తి, తాడిపత్రి, పత్తికొండలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడ్డాయి.(Andhra Pradesh Heavy Rains)

Weather Forecast: తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు.. రుతుపవనాల రాక ఎప్పుడంటే?

వర్షం పడటంతో ఆ ప్రాంతాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో స్థానికులు కాస్త రిలాక్స్ అయ్యారు. ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు చెరిగాడు. ఎన్నడూ లేనంతగా ఈసారి ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

Rains (3)

Rains (3)

ఈ హాట్ సమ్మర్ ను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఇవేం ఎండలు బాబోయ్ అని చెమట్లు కక్కుతున్నారు. ఎండల తీవ్రత ఏ రేంజ్ లో ఉందంటే… ఇంట్లో నుంచి బయటకు వచ్చే సాహసం కూడా చేయలేకపోయారు. ఎప్పుడెప్పుడు ఎండా కాలం ముగుస్తుందా? వానలు కురుస్తాయా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.(Andhra Pradesh Heavy Rains)

Rains (2)

Rains (2)

మరోవైపు తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరింతగా నైరుతి రుతుపవనాలు విస్తరించడం, సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులతో వానలు పడనున్నట్లు వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో 4-5 రోజుల్లో కేరళ, కర్నాటక తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. వాయువ్య, మధ్య భారత్ పై ఉష్ణగాలుల ప్రభావం తగ్గుముఖం పట్టనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

South West Monsoon : అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఇది ఇలా ఉంటే.. దేశ ప్రజలకు భారత వాతవరణ శాఖ చల్లని కబురు చెప్పింది. సోమవారం అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల రాకతో ఇటు జనాలు, అటు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.(Andhra Pradesh Heavy Rains)

భారత దేశంలో అత్యధిక వర్షపాతం కలిగించేవి నైరుతి రుతుపవనాలే. అందుకే, దేశం మొత్తం వీటి కోసం ఎదురుచూస్తుంది. అయితే, ఈసారి నైరుతి రుతుపవనాలు దేశంలో ముందుగానే ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అంతేకాదు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ దీవుల వరకు ఇవి విస్తరించినట్టు ఐఎండీ వివరించింది.

కాగా, నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు నాటికి కేరళను తాకుతాయని, తెలంగాణలో జూన్ మొదటివారంలో వీటి ప్రవేశం ఉంటుందని పేర్కొంది. నైరుతి సీజన్ పై రైతాంగం అనేక ఆశలు పెట్టుకుంది.