Anantapuram : అనంత జిల్లాలో తప్పిన పెను ప్రమాదం-30 మంది మహిళలు సురక్షితం

అనంతపురం జిల్లాలో  ఈరోజు ఉదయం పెను ప్రమాదం తప్పింది.

Anantapuram : అనంత జిల్లాలో తప్పిన పెను ప్రమాదం-30 మంది మహిళలు సురక్షితం

Atp Bus Accident Avoid

Anantapuram :  అనంతపురం జిల్లాలో  ఈరోజు ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన వర్షాలతో హిందూపురం వద్ద కోట్నూర్ చెరువు పొంగి ప్రవహస్తోంది. ఈరోజు ఉదయం టెక్స్పోర్ట్ గార్మెంట్స్ ఫ్యాక్టరీకి చెందిన బస్సు గార్మెంట్ కంపెనీకి చెందిన 30 మంది మహిళా ఉద్యోగులతో… పెనుకొండ నుండి హిందుపురం వైపుకు వెళ్తోంది.

బస్సు కోట్నూర్ చెరువు వద్ద ఉన్న కల్వర్ట్ మీదుగా వెళుతోంది. ఆ సమయంలో నీటి ప్రవాహానికి బస్సు కొట్టుకొని పోతుండగా బ్రిడ్జికి అమర్చిన రెయిలింగ్ తట్టుకొని నిలబడడంతో ప్రమాదం తప్పింది. ఇది గమినించిన స్థానికులు హుటా హుటిన బస్సు వద్దకు వచ్చి అందులోని వారిని బస్సుదింపి క్షేమంగా వడ్డుకు తీసుకువచ్చారు.
Also Read : Tiger Scare In Bhadradri Dist : భద్రాద్రి జిల్లా వాసులను హడలెత్తిస్తున్న పులి సంచారం

హిందూపూర్ నుంచి దాదాపు రోజుకు సుమారు 80  బస్సులు సరిహద్దు కర్ణాటక గ్రామాల నుంచి   కార్మికులను తీసుకు వస్తుంటాయి. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో కూడా అనంతపురం జిల్లాలోని పలు చెరువులు నిండి, పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న బుక్కరాయ సముద్రం చెరువు నిండి పొంగి ప్రవహిస్తుండగా 30 మంది విద్యార్ధులతో వెళ్తున్న బస్సును కూడా జేసీబీ ద్వారా పోలీసులు రక్షించారు. ఈరోజు కొట్నూరు వద్ద జరిగిన ప్రమాదాన్ని పసి గట్టిన స్ధానికులు 30 మంది మహిళలను రక్షించటంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.