AP Govt: జగన్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం

ఏపీ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలపై మావోయిస్టు పార్టీ ఏవోబీ జోనల్ కార్యదర్శి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించవని బహిరంగలేఖలో విమర్శించారు.

AP Govt: జగన్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం

Ap Govt (2)

Updated On : June 17, 2021 / 3:00 PM IST

AP Govt: ఏపీ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలపై మావోయిస్టు పార్టీ ఏవోబీ జోనల్ కార్యదర్శి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించవని బహిరంగలేఖలో విమర్శించారు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్నాయి తప్ప పేదలకు మేలు జరగడం లేదన్నారు. ఇక పథకాల పేరుతో అప్పులు చేసి ప్రజలపై పన్ను భారాన్ని మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు అంగీకరించిన ప్రభుత్వం కార్మికులను ప్రత్యక్షంగా మోసం చేస్తుందన్నారు. గతంలో కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కూడా మావోయిస్టు పార్టీ ఏపీ ప్రభుత్వంఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ రాయగా.. ప్రభుత్వం కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను ఏమాత్రం పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిందని అప్పట్లో ధ్వజమెత్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ లేఖ రాశారు.