Kodali Nani on Pawan: మా ఉద్దేశం అది కాదు.. జగన్‌ను బెదిరించేవాళ్లు ఇంకా పుట్టలేదు..!

సినీ పరిశ్రమను ఉద్దేశించి.. ఏపీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరినో ఉద్దేశించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని చెప్పారు.

Kodali Nani on Pawan: మా ఉద్దేశం అది కాదు.. జగన్‌ను బెదిరించేవాళ్లు ఇంకా పుట్టలేదు..!

Kodalinani

టాలీవుడ్ సినీ పరిశ్రమను ఉద్దేశించి.. ఏపీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరినో ఉద్దేశించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని.. ఇండస్ట్రీ బాగుపడాలన్నదే జగన్ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ పడుతున్న ఇబ్బందులపై.. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద.. మంత్రి స్పందించారు. పవన్ సినిమా హిట్టైనా.. ఫెయిలైనా.. ప్రభుత్వానికి వచ్చేది కానీ.. పోయేది కానీ ఉండదన్నారు.

సౌకర్యాలు కల్పించేందుకు మేం సిద్ధం

సినిమా రంగానికి చెందిన వాళ్లు.. ఎలాంటి సౌకర్యాలు కోరినా.. ప్రభుత్వం తరఫున అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలాంటి ప్రాంతాలు మాత్రమే కాదని.. ఎక్కడైనా షూటింగులు చేసుకోవచ్చని.. అందుకు కావాల్సిన సౌకర్యాలు కోరితే.. తగిన సహాయాన్ని అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సినిమా టికెట్ల రేట్ల సమస్య.. గతం నుంచీ ఉందని చెప్పిన మంత్రి.. తాము కోర్టు ఆదేశాల ప్రకారమే కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో.. నిర్మాతలు న్యాయస్థానానికి వెళ్తే.. కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయని.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు.

కోర్టు ఆదేశాలను.. అలా…

కమిటీ నిర్ణయం వచ్చే వరకూ.. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని అప్పుడు కోర్టు ఇచ్చిందని.. అది కొందరు అలుసుగా తీసుకుని.. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితిని మార్చేందుకే.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కమిటీ వేసి.. నిర్ణయం తీసుకుందని అన్నారు. నలుగురు నిర్మాతలనో.. నలుగురు హీరోలనో ఉద్దేశించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. పవన్ విమర్శలు, హెచ్చరికలపైనా కొడాలి నాని స్పందించారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలు, భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. జగన్ ను భయపెట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదని చెప్పారు. జీవిత కాలం టైమ్ ఇస్తున్నానని.. ఎవరూ జగన్ ను ఏమీ చేయలేరని సవాల్ చేశారు.

Also Read:

Pawan Kalyan: తొక్కిపట్టి నార తీస్తా.. వైసీపీ నేతలూ.. యుద్ధానికి సిద్ధం కండి..!

భయం చూపిస్తానన్న పవన్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్