Movie Tickets Issue: సినిమా టికెట్ల రేట్లు ఇంకా ఫైనల్ కాలేదు – మంత్రి పేర్ని నాని

ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టికెట్ల వివాదంతో పాటు అధికారుల దాడులతో అప్పుడు చాలా థియేటర్లు స్వచ్ఛందంగానే మూసేశారు. మూవీ టికెట్ల విక్రయానికి..

Movie Tickets Issue: సినిమా టికెట్ల రేట్లు ఇంకా ఫైనల్ కాలేదు – మంత్రి పేర్ని నాని

Movie Tickets Issue

Updated On : February 9, 2022 / 7:41 PM IST

Movie Tickets Issue: ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టికెట్ల వివాదంతో పాటు అధికారుల దాడులతో అప్పుడు చాలా థియేటర్లు స్వచ్ఛందంగానే మూసేశారు. మూవీ టికెట్ల విక్రయానికి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తామని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమ నుండి చాలామంది ప్రముఖులు ప్రభుత్వం చర్చలు జరిపినా అప్పుడు అది పరిష్కారమవలేదు. ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసి చర్చలు జరిపినా ఆ అంశం ఇంకా కొలిక్కి రాలేదు.

Movie Promotions: సినిమా సంగతేమో కానీ.. ప్రమోషన్ల కోసం కష్టపడుతున్న స్టార్లు!

అటు ప్రభుత్వ పెద్దలు ఈ వివాదంపై చర్చ జరుపుతున్నామని చెప్పగా.. ఇండస్ట్రీ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తూ మాట్లాడారు తప్ప.. ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. గత నెలలో మెగాస్టార్ చిరంజీవి ఇదే అంశంపై సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి చర్చించారు. ఈ గురువారం మరోసారి చిరంజీవితో పాటు మరికొంత సినీ పెద్దలు కూడా సీఎంతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి పేర్ని నాని ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నానీ మాట్లాడుతూ సినిమా టికెట్ల రేట్లు ఇంకా ఫైనల్ కాలేదని వెల్లడించారు.

Sarkaru Vaari Paata: కీర్తి భుజంపై వాలిన మహేష్.. పోస్టర్ అదిరిందంతే!

కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించిన మంత్రి నానీ.. రేపు సీఎంతో ఇండస్ట్రీ పెద్దలు భేటీ అవుతున్నారని.. చాలామంది సీఎంను కలవాలని అనుకున్నా.. కరోనా ప్రోటోకాల్ కారణంగా కొంతమందికి అవకాశం కల్పించారని చెప్పారు. ఇక చిరంజీవి గౌరవ మర్యాదలు గల వ్యక్తని.. ఆయనని సీఎం ఒక మాట ఇచ్చారంటే నెరవేరి తీరుతుందని చెప్పారు.