Movie Promotions: సినిమా సంగతేమో కానీ.. ప్రమోషన్ల కోసం కష్టపడుతున్న స్టార్లు!

వందల కొద్దీ సినిమాలు.. పదుల కొద్దీ స్టార్ హీరోలు.. వాటిల్లో ఆడియన్స్ కి మన సినిమా గుర్తుండాలంటే.. సమ్ థింగ్ డిఫరెంట్ గా ప్రమోట్ చెయ్యాలి. అందుకే సినిమాని ఆడియన్స్..

Movie Promotions: సినిమా సంగతేమో కానీ.. ప్రమోషన్ల కోసం కష్టపడుతున్న స్టార్లు!

Movie Promotions

Movie Promotions: వందల కొద్దీ సినిమాలు.. పదుల కొద్దీ స్టార్ హీరోలు.. వాటిల్లో ఆడియన్స్ కి మన సినిమా గుర్తుండాలంటే.. సమ్ థింగ్ డిఫరెంట్ గా ప్రమోట్ చెయ్యాలి. అందుకే సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ప్రమోషన్లు చేస్తూ.. ఆడియన్స్ కి సినిమాని రీచ్ చేస్తున్నారు. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ అందరూ ఈ ఫంక్షన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ కోవిడ్ టైమ్ లో అలాంటి రిస్క్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి.. ప్రమోషన్ల విషయంలో కొత్త కాన్సెప్ట్స్ వెతుకుతున్నారు మేకర్స్.

Pooja Hegde: ఐదు సినిమాలు రిలీజ్.. ఈ ఇయర్ తనదే అంటున్న బుట్టబొమ్మ!

లేటెస్ట్ గా రాధేశ్యామ్ సరికొత్త కాన్సెప్ట్ ని తెరమీదకి తెచ్చింది. ఇంకో నెలలో రిలీజ్ కురెడీ అవుతున్న రాధేశ్యామ్.. తన సినిమా ప్రమోషన్లను మరోసారి క్రేజీగా స్టార్ట్ చేసింది. దాదాపు రెండేళ్లనుంచి ప్యాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ మూవీ.. ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. రాదేశ్యామ్ లవ్ స్టోరీ కాబట్టి.. ఈ థీమ్ తో వాలంటైన్స్ డే రోజు పార్టీ ఎరేంజ్ చేసింది. ఫిబ్రవరి 14 రాత్రి 8 నుంచి హైదరాబాద్ లోని క్లబ్ లో స్పెషల్ సెట్ లో గ్రాండ్ గా జరగబోయే ఈ థీమ్ పార్టీ కి యూనిట్ మొత్తం అటెండ్ అయ్యి సందడి చెయ్యబోతోంది. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా యూరోపియన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ వాలంటైన్ థీమ్ పార్టీ తో సరికొత్త ప్రమోషన్లకు తెర తీసింది.

Pushpa 2: టీమ్ వర్క్ మొదలు పెట్టిన పుష్పరాజ్.. అనుకున్నట్లే రిలీజ్!

రాజమౌళి సినిమాకు ఎంత ప్లాన్ చేస్తారో.. ప్రమోషన్లకు కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తారు. అలా.. ఇండియాస్ క్రేజీ మూవీ ట్రిపుల్ఆర్ అయితే ప్రమోషన్లు వేరే లెవల్ లో చేసింది. సంక్రాంతికి రీలీజ్ అవుదామనుకున్న ఈ స్టార్ స్టడెడ్ మూవీ ఇంతకుముందు ఇండియాలో ఏ సినిమా చెయ్యనంత గ్రాండ్ గా ఆల్ ఓవర్ ఇండియా ఈవెంట్లు చేసింది. అయితే సినిమా లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు మార్చి 25న రిలీజ్ ప్లాన్ చేసుకున్న ట్రిపుల్ఆర్ మళ్లీ రీసెంట్ గా ప్రమోషన్లు మొదలుపెట్దింది.

Mallika Sherawat: వయసు నాలుగు పదులు దాటినా తగ్గని ఘాటు!

మొన్నీమధ్యనే సినిమాకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ సోషల్ మీడియాలో ట్రిపుల్ఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. అంతేకాదు.. లేటెస్ట్ గా.. జనవరిలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్స్ కి సంబంధించి వీడియోస్ ని ఫుల్ గా.. త్వరలోనే మీ ముందుకు తెస్తాం అంటూ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఇలా కాన్సెప్ట్ తో ఆడియన్స్ లో సినిమా గురించి మాట్లాడేలా చేస్తూ.. సినిమా ప్రమోషన్లు డిఫరెంట్ గా చేస్తోంది ట్రిపుల్ ఆర్ టీమ్.

Ashu Reddy: ఆపని ఫోటో షూట్లు.. అషూ నీకిది తగునా?!

మేలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న సర్కారు వారి పాట కూడా ప్రమోషన్లు మొదలుపెట్టేశారు. సంక్రాంతి నుంచి మే కి షిఫ్ట్ అయిన ఈ సినిమా గురించి అప్పుడే ఫాన్స్ కి అప్ డేట్స్ ఇస్తూ.. సినిమాని హైప్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి వరసగా 4 రోజుల పాటు బ్యాక్ టూ బ్యాక్ అప్ డేట్స్ అనౌన్స్ చేసి ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. హీరోయిన్ కళావతిని రివీల్ చేసే సాంగ్ ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజు రిలీజ్ చెయ్యబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో సినిమా రేంజ్ పెరిగిపోయింది. అందుకే ఈ క్రేజ్ ని సస్టెయిన్ చెయ్యడానికి ఈ రేంజ్ లో సరికొత్త ప్రమోషనస్ చేస్తోంది.

Radhe Shyam: థీమ్ పార్టీ.. క్యూరియాసిటీ తెగ పెంచేస్తున్న సరికొత్త ప్రమోషన్!

విజయ్ దేవరకొండ, పూరీ జగన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లైగర్ సినిమాని కూడా ఆడియన్స్ లోకి మ్యాసివ్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది టీమ్. సినిమా రిలీజ్ ఆగస్ట్ లో అయినా.. లైగర్ కి సంబందించి ప్రతి విషయం ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. అందుకే లేటెస్ట్ గా సినిమా షూటింగ్ అయిపోయిందంటూ సరికొత్తగా వాయిస్ మెసేజ్ ఇచ్చారు టీమ్. ఎట్ ద సేమ్ టైమ్.. విజయ్ కూడా తన ఫోటో షూట్స్ తో, స్వాగ్, స్టైల్ తో ఆడియన్స్ ని సినిమా గురించి మాట్లాడేలా చేస్తున్నాడు.

Aishwarya Rai: లతా మంగేష్కర్ కి ఐష్ నివాళి.. నెటిజన్ల ట్రోల్స్!

ఈ వారం రిలీజ్ కు రెడీగా ఉన్న ఖిలాడి ప్రమోషన్ల గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సినిమా రిలీజ్ మీద ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్న రవితేజ అండ్ టీమ్.. సినిమాకు సంబంధించి ప్రతి మేజర్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ.. రోజుకో అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. అటు సాంగ్ టీజర్స్ తో, లిరికల్ సాంగ్స్ తో, క్యారెక్టర్ రివిలీషన్ తో వరసగా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ.. ఆన్ లైన్ ప్రమోషన్లు కూడా గ్రాండ్ గా చేస్తున్నారు ఖిలాడి అండ్ కో.

Devi Sri Prasad: అరగంటలో 6 పాటలు కంపోజ్ చేసిన దేవిశ్రీ.. ఏ సినిమా కోసమంటే?

మరో యంగ్ హీరో కూడా ప్రమోషన్లని డిఫరెంట్ గా స్టార్ట్ చేశాడు. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్న వరుణ్ తేజ్.. గని అనే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సీరియస్ సబ్జెక్ట్ ని తీసుకున్నా.. ఈ మూవీని యూత్ కి కనెక్ట్ చెయ్యడానికి కొత్త రూట్ వెతికారు. బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీకి సంబందించి గని టీమ్ సిటీ టూర్స్ ప్లాన్ చేసింది. విజయవాడలో గని టీమ్ సందడి చేసింది. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించి రోమియో జూలియట్ అనే క్రేజీ సాంగ్ ని ఈ వాలంటైన్స్ డే మూడ్ లో రిలీజ్ చేస్తూ ఇంట్రస్టింగ్ ప్రమోషన్లు చేస్తోంది.