ఎంఎస్ఎమ్ఈలపై ఏపీ గవర్నమెంట్ ఫోకస్.. రీ స్టార్టింగ్‌కు భారీ బడ్జెట్ కేటాయింపు

  • Published By: veegamteam ,Published On : June 28, 2020 / 05:40 PM IST
ఎంఎస్ఎమ్ఈలపై ఏపీ గవర్నమెంట్ ఫోకస్.. రీ స్టార్టింగ్‌కు భారీ బడ్జెట్ కేటాయింపు

రీస్టార్ట్‌ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్‌ఎంఈలకు జూన్ 29న రెండో విడత బకాయిలను సీఎం వైయస్‌.జగన్‌ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభిస్తారు. కొవిడ్‌ 19, లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలు గట్టెక్కేందుకు, తిరిగి ఆ కంపెనీలు ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

రీస్టార్ట్‌ కార్యక్రమంలో భాగంగా  7717 పరిశ్రమలకు అందాల్సిన 17వేల 45 బకాయిల్లో తొలివిడత ఇప్పటికే మే 22న విడుదల చేయగా…. రెండో విడత జూన్‌ 29న ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇందులో 2వేల 435 ఎంఎస్‌ఎంఈ యూనిట్స్‌కు సంబంధించిన 4వేల 900 క్లెయిమ్స్‌ ద్వారా ఎస్సీ,ఎస్టీ పారిశ్రామవేత్తలకు లబ్ధి చేకూరనుంది.

రీస్టార్ట్‌  ప్యాకేజీలో భాగంగా రెండో విడత బకాయిలు చెల్లింపులు కింద  128 పుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లకు 163 క్లెయిమ్స్‌కు సంబంధించిన రూ. 58.97 కోట్లు విడుదల కానున్నాయి. ఎంఎస్‌ఎంఈలతో పాటు వాటి అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన కరెంటు ఫిక్స్‌డు ఛార్జీలుకు సంబంధించి 3 నెలలు పాటు ఏప్రిల్‌ 2020 నుంచి జూన్‌ 2020 వరకు ప్రభుత్వం మాఫీ చేసింది. దీనికోసం ప్రభుత్వం రూ.188 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మిగిలిన మొత్తాన్ని ఇతర వ్యాపార అవసరాల కోసం కేటాయించింది.

లార్జ్‌ అండ్‌ మెగా పరిశ్రమలకు అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్‌ 2020 నుంచి జూన్‌ 2020 వరకు కరెంటు  ఫిక్స్‌డు ఛార్జీలను చెల్లించనవసరం లేకుండా వాయిదా వేసింది. దీని కోసం ప్రభుత్వం రూ.17 కోట్ల ఖర్చు చేయనుంది.

సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు  రూ.200 కోట్లు రూపాయలును వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్స్‌ కింద 6–8 శాతం వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాల మంజూరుకు  నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కింద మంజూరు చేసే ఈ రుణాలపై  3 సంవత్సరాల మారిటోరియం

కోవిడ్‌ ప్రభావంతో  సూక్ష్మ, చిన్న పరిశ్రమలు మార్కెట్‌ సౌకర్యాలు లేక  ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో వీటికి మార్కెట్‌ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎంఎస్‌ఎంఈల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తనకు అవసరమైన సేవలు, సరుకులును 25శాతం తీసుకోవాలని నిర్ణయం. ఇందులో 4 శాతం ఎస్సీ,ఎస్సీలకు, ౩ శాతం మహిళలకు కేటాయించాలని నిర్ణయించారు.

అన్ని ప్రభుత్వ శాఖలు, స్ధానిక సంస్ధలు, రాజ్యాంగ సంస్ధలు, డెవల్‌మెంట్‌ అథారిటీలు, కంపెనీలు, కార్పొరేషన్‌లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్, సొసైటీలు, ట్రస్టులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్ధలు ద్వారా మార్కెటింగ్‌ కల్పించనున్నారు.

ఎంఎస్‌ఎంఈలకు ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ వర్తించనుంది. ఈ యేడాది ఫిబ్రవరి 29 నాటికి మొత్తం అవుట్‌ స్టాండింగ్‌ క్రెడిట్‌లో 20 శాతం రుణ మంజూరు అవుతుంది. ఈ స్కీం కింద వంద కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు రూ.25 కోట్ల రూపాయలు అవుట్‌ స్టాండింగ్‌ లోన్ ఇస్తారు. 4 యేళ్ల కాలపరిమితితో రుణాలు మంజూరుతో పాటు ప్రిన్సిపల్‌ పేమెంట్‌ పై 12 నెలల కాలం మారటోరియం విధించనున్నారు.

ఈ పథకం కింద 44వేల 436 ఎంఎస్‌ఎంఈలకు రూ.1457 కోట్లు రుణాలు లబ్ధి చేకూరనుంది. రీస్టార్ట్‌ ప్యాకేజీ లో భాగంగా ఎంఎస్‌ఎంఈలు, లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీస్‌ కూడా ఆన్‌ లైన్లో ఫిక్స్‌డు, డిమాండ్‌ ఛార్జీల రద్దుతో పాటు ఎంఎస్‌ఎంఈలు వర్కింగ్‌ కేపిటల్‌ లోన్స్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు. దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్‌ సైట్‌   http://www.apindustries.gov.in/restart-package