Peddireddy Midhun Reddy : దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని సభలో ఆ మాట చెప్పండి- చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలకు వైసీపీ ఎంపీ సవాల్

రాజంపేట పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

Peddireddy Midhun Reddy : దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని సభలో ఆ మాట చెప్పండి- చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలకు వైసీపీ ఎంపీ సవాల్

Peddireddy Midhun Reddy (Photo Credit : Facebook)

Updated On : May 8, 2024 / 4:29 PM IST

Peddireddy Midhun Reddy : ముస్లిం రిజర్వేషన్లు 4 శాతం కొనసాగిస్తామని ప్రధాని మోదీ చెప్పగలుగుతారా అని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోడీ సభలో 4 శాతం రిజర్వేషన్ కొనసాగిస్తామని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు, బీజేపీ అభ్యర్థి కిరణ్ కు ఉందా అని నిలదీశారు. మైనారిటీలకు మీరు చేసే అన్యాయం ఈరోజు జరిగే సభలో తేలిపోనుందన్నారు. పుంగనూరులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

”ముస్లిం రిజర్వేషన్ల పట్ల కట్టుబడి ఉంటే మోడీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. జీవితంలో లిక్కర్, వడ్డీ వ్యాపారాలు మేమెప్పుడూ చేయలేదు. అలాంటి వ్యాపారాలు మా మనస్సాక్షికి విరుద్ధం. ఆస్తులు కాపాడుకునేందుకే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా. సీఎంగా డబ్బు తీసుకోకుండా న్యాయంగా పనిచేశానని ప్రమాణం చేయాలి. మాపై మీరు చేస్తున్న ఆరోపణలన్నింటికీ ప్రమాణం చేసేందుకు నేను కాణిపాకం వస్తాను. సీఎంగా ఉన్న సమయంలో పుంగనూరుకు ఏం చేశారో చెప్పాలి.

రాజంపేట పార్లమెంటుతోపాటు 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు వాస్తవమని భావించాల్సి వస్తుంది. ఎన్నికల తర్వాత తిరిగి హైదరాబాద్ కు తరిమేస్తాం. టికెట్ బుక్ చేసుకోమని చెబుతున్నాం” అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.

Also Read : పవన్ కల్యాణ్‌.. నీ చరిత్ర బయటపెట్టు: ముద్రగడ పద్మనాభం