Venigandla Ramu : గుడివాడ టికెట్ చంద్రబాబు ఎవరికిచ్చినా నాకు బాధ లేదు, కొడాలి నానిని ఓడించడమే నా ధ్యేయం- వెనిగండ్ల రాము
గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో విజయం సాధించి తీరతామన్నారాయన. Venigandla Ramu - Gudivada

Venigandla Ramu - Gudivada
Venigandla Ramu – Gudivada : చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, గన్నవరం నుంచే కాదు గుడివాడ నుంచి కూడా పోటీ చేయడానికి తాను రెడీ అంటూ యార్లగడ్డ వెంకట్రావ్ చేసిన వ్యాఖ్యలపై గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము స్పందించారు. గుడివాడ టికెట్ యార్లగడ్డకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
కొడాలి నానిని ఓడించడమే తన ధ్యేయం అన్నారు. గుడివాడ టికెట్ ని చంద్రబాబు ఎవరికి ఇచ్చినా గెలిపించే తీరతామని వెనిగండ్ల రాము ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో విజయం సాధించి తీరతామన్నారాయన.
”యార్లగడ్డ వెంకట్రావు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిజం ఏంటో తెలుసుకున్నారు. అందరికీ తెలుసు. వైసీపీలో మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికీ విలువ లేదు. జీరో వ్యాల్యూ. ఏం చెబితే అది చెయ్యాలి. బానిసల్లా ఉండాలి. బానిసల్లా పని చేయగలిగిన వారే అక్కడ ఉండగలరు. కట్టు బానిసత్వం క్లియర్ గా కనిపిస్తుంది. తిట్టు అంటే తిట్టాలి. నిల్చో అంటే నిల్చోవాలి. కూర్చో అంటే కూర్చోవాలి. ఆత్మాభిమానం ఉన్న ఎవరూ ఆ పార్టీలో ఇమడలేరు. త్వరలో ఇంకా చాలామంది వైసీపీ నుంచి బయటకు వస్తారు.
గుడివాడ టికెట్ ఆశించలేదు. గుడివాడలో టీడీపీ గెలవాలి అనే ఏకైక లక్ష్యంతో వచ్చాను. గుడివాడకు కావాల్సింది ఏమైనా తెచ్చుకోగల కెపాసిటీ ఒక్క చంద్రబాబుకి మాత్రమే ఉంది. తప్పకుండా గుడివాడ గెలవాలి. ఎవరికి టికెట్ ఇచ్చినా ఒక్కటే” అని వెనిగండ్ల రాము అన్నారు.