SSRC Meeting : దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభం..ఏపీ ప్రస్తావించనున్న అంశాలు

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. కౌన్సిల్ వైస్ చైర్మన్ హోదాలో సమావేశానికి వచ్చిన వారిని ఆయన సత్కరించారు.

SSRC Meeting : దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభం..ఏపీ ప్రస్తావించనున్న అంశాలు

Ssrc

Southern States Regional Council : తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. కౌన్సిల్ వైస్ చైర్మన్ హోదాలో సమావేశానికి వచ్చిన వారిని ఆయన సత్కరించారు.

మొదటగా లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్ పటేల్ ప్రసంగించారు. అనంతరం అండమాన్ నికోబర్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ సింగ్ మాట్లాడారు. అనంతరం వరుసగా పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగ స్వామి, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రతినిధులు తమ అజెండా అంశాలను ముందుంచి ప్రసంగించనున్నారు.

దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలి : ఈటల

చివరగా ఏపీ సీఎం జగన్ తన అజెండా అంశాలను ముందుంచి ప్రసంగించనున్నారు. అనంతరం అజెండా అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగనుంది.

ఏపీ ప్రస్తావించనున్న అంశాలు..

  • ఏపీకి ప్రత్యేక హోదా
  • పన్ను ప్రోత్సహకాలు
  • ఏడు జిల్లాలకు వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధులు
  • పోలవరం ప్రాజెక్టు
  • ద్రవ్యలోటు భర్తీ
  • రాష్ట్రంలో కేంద్రం స్థాపించే సంస్థలు
  • కొత్త రాజధానులకు సహకారం
  • కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు
  • వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్
  • కొత్త రైల్వే జోన్
  • తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు
  • విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు