Anagani Satya Prasad : జగన్ ప్రభుత్వం తీరుమార్చుకోవాలి.. వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం

మూడేళ్లుగా అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని ఉపాధ్యాయులపై కక్షపూరితంగా అమలు చేస్తున్నారని సత్యప్రసాద్ అన్నారు. కరోనా సమయంలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు చనిపోతే ,,,

Anagani Satya Prasad : జగన్ ప్రభుత్వం తీరుమార్చుకోవాలి.. వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం

Anagani Satya Prasad

Updated On : October 29, 2023 / 11:16 AM IST

TDP MLA Anagani Satya Prasad : ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా ఉంచి మద్యం అమ్మించారు, టీచర్లచే బాత్ రూమ్ లు కడిగించారు. బదిలీల విషయంలో న్యాయం చేయమని అడిగినందుకు ఉపాధ్యాయులపై లాఠీ ఝుళిపించారు, పీఆర్ సీపై ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టించారు. సీపీఎస్ రద్దు హామీని అమలు చేయమంటే భౌతికంగా దాడులు చేశారు అంటూ సత్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Madhya Pradesh polls : అసెంబ్లీ ఎన్నికల్లో బావామరదళ్ల మధ్య పోరు..భార్య విజయం కోసం ఏనుగును ప్రార్థిస్తున్న భర్త

మూడేళ్లుగా అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని ఉపాధ్యాయులపై కక్షపూరితంగా అమలు చేస్తున్నారని సత్యప్రసాద్ అన్నారు. కరోనా సమయంలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు చనిపోతే వాళ్ల కుటుంబాలను ఆదుకోలేదు.
విద్యార్థుల హాజరు, బాత్‌రూమ్‌ల ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, నాడునేడు ఫొటోలు అంటూ టీచర్లపై పరిమితికి మించి యాప్‌ల భారం జగన్ ప్రభుత్వం మోపిందని సత్యప్రసాద్ అన్నారు. సీపీయస్ ఉద్యమం చేశారని అనేక మందిపై బైడోవర్ కేసులు పెట్టారు. ఒకరోజు ప్రవీణ్ ప్రకాశ్ ఉపాధ్యాయుల విధులు నిర్వహిస్తే వారి బాధలేంటో ఆయనకు తెలుస్తాయని సత్యప్రసాద్ అన్నారు.

Also Read : Goa Athletes : గోవాలో తక్కువ ధరకే లభిస్తుందని మద్యం తాగొద్దు…అథ్లెట్లకు మంత్రి సలహా

ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి, ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని సత్యప్రసాద్ అన్నారు.