Goa Athletes : గోవాలో తక్కువ ధరకే లభిస్తుందని మద్యం తాగొద్దు…అథ్లెట్లకు మంత్రి సలహా
గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ తాజాగా అథ్లెట్లకు సంచలన సలహా ఇచ్చారుర. 37వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా అథ్లెట్లు గోవాలో సరదాగా గడపాలని మంత్రి సూచించారు....

Liquor
Goa Athletes : గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ తాజాగా అథ్లెట్లకు సంచలన సలహా ఇచ్చారుర. 37వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా అథ్లెట్లు గోవాలో సరదాగా గడపాలని మంత్రి సూచించారు. గోవాలో మద్యం తక్కువ ధరకే లభిస్తుందని మద్యం తాగ వద్దని మంత్రి క్రీడాకారులకు సలహా ఇచ్చారు. గోవాలో మద్యం చౌకగా దొరుకుతుందని, జీడిపప్పు కూడా చౌకగా లభిస్తుందని మంత్రి చెప్పారు.
Also Read : Hero Bus Driver : గుండెపోటు వచ్చినా 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్
అయితే మీరు జాతీయ క్రీడాకారులైనందున మద్యం తాగకూడదని మంత్రి సూచించారు. గోవాలో తొలిసారిగా జరుగుతున్న 37వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవాన్ని మార్గోవోలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Also Read : Mukesh Ambani : రిలయన్స్ ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు…ఈ సారి రూ.200 కోట్లు ఇవ్వాలని…
పదివేల మంది అథ్లెట్లు పాల్గొంటున్న ఈ ఆటలు నవంబర్ 9వతేదీ వరకు జరుగుతాయి. బహుళ-క్రీడల కార్యక్రమం ఐదు గంటల పాటు జరిగిన గ్రాండ్ ప్రారంభ వేడుక జరిగింది. ఈ ఉత్సవంలో 600 మంది కళాకారుల ప్రదర్శనలు జరిపారు.