Agency GK Veedhi: ఆకలితో అలమటిస్తున్న గిరిజన విద్యార్థులు
విశాఖపట్నంలోని ఏజెన్సీ జీకే వీధి మండలంలోని సప్పర్ల బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో గిరిజన విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. శనివారం నుంచి భోజనం పెట్టకపోతుండటంతో ఆకలి తట్టుకోలేక.......

Tribal Students
Agency GK Veedhi: విశాఖపట్నంలోని ఏజెన్సీ జీకే వీధి మండలంలోని సప్పర్ల బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో గిరిజన విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. శనివారం నుంచి భోజనం పెట్టకపోతుండటంతో ఆకలి తట్టుకోలేక ఇళ్లకు వెళ్లిపోయారు.
అధికారులు, ఉపాధ్యాయుల సైతం విద్యార్థుల ఆకలి బాధలను పట్టించుకోలేదు. దీనిని నిరసిస్తూ.. విద్యార్థులతో కలిసి రహదారిపై ప్రజా ప్రతినిధులు ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు.
వంటచేసేందుకు గ్యాస్ లేకపోవడంతో సాకుగా చెప్పి వంట సిబ్బంది పనిమానేశారు. విద్యార్థులు తమ సొంత డబ్బులతో జొన్నపిండి కొనుగోలు చేసి వండుకున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా వార్డెన్ గా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయుడు శనివారం సాయంత్రమే ఇంటికి వెళ్లిపోయారు. అతని తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………: ఆసుపత్రిలో పిల్లల వార్డులో మంటలు.. నలుగురు మృతి