TTD Snake Catcher : ఇంకా ఆసుపత్రిలోనే స్నేక్ క్యాచర్

ఓ కళాశాలలో నాలుగు రోజుల క్రితం పామును పడుతుండగా పాము కాటుకు గురైన భాస్కర్ నాయుడు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. భాస్కర్ నాయుడికి...

TTD Snake Catcher : ఇంకా ఆసుపత్రిలోనే స్నేక్ క్యాచర్

Ttd Snake Catcher Bhaskar Naidu

TTD Snake Catcher Bhaskar Naidu : తిరుమలలో పాము కనిపించింది అని సమాచారం అందితే చాలు.. వెంటనే రంగంలోకి దిగుతారు ఆయన. అది ఎంత పెద్ద పాము అయినా, ఎంత విషపూరితమైనది అయినా… అస్సలు భయపడడు. ఎంతో చాకచక్యంగా, అవలీలగా పట్టుకుంటాడు. దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తాడు. ఆయన తన చేతులతో వేలాది పాములను పట్టాడు. ఆయనే భాస్కర్ నాయుడు. తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో భాస్కర్ నాయుడు పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. పాము కనిపిస్తే చాలు.. స్థానికులకు ముందుగా గుర్తుకొచ్చే పేరు టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు.

Read More : Omicron Variant : ఈ కరోనా రక్కసి.. చాలా డేంజరస్.. మన కళ్లముందే విరుచుకుపడుతోంది.. : WHO హెచ్చరిక!

అలాంటి వ్యక్తి.. పాము కాటుకు గురయ్యాడు. ఓ కళాశాలలో నాలుగు రోజుల క్రితం పామును పడుతుండగా పాము కాటుకు గురైన భాస్కర్ నాయుడు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. భాస్కర్ నాయుడికి కిడ్నీలో సమస్య రావడంతో వైద్యులు డయాలసిస్ చేశారు. కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఆయన ఆసుపత్రి పాలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఎలాంటి అపాయం జరక్కూడదని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.