Omicron Variant : ఈ కరోనా రక్కసి.. చాలా డేంజరస్.. మన కళ్లముందే విరుచుకుపడుతోంది.. : WHO హెచ్చరిక!

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది.

Omicron Variant : ఈ కరోనా రక్కసి.. చాలా డేంజరస్.. మన కళ్లముందే విరుచుకుపడుతోంది.. : WHO హెచ్చరిక!

Omicron Variant : Omicron virus is Very dangerous and continues to evolve before our very eyes, Warns WHO

Omicron Variant : ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. దాదాపు రెండేళ్లుకు పైగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఆల్ఫా, బీటా వేరియంట్ల తర్వాత డెల్టా వేరియంట్ విజృంభించింది ఆ తర్వాత ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది.

ఇంతకీ ఈ వేరియంట్లన్నీ కరోనా నుంచి వచ్చినవే అయినప్పటికీ రానురాను మ్యుటేషన్ చెందుతూ మునుపటి వేరియంట్ల కంటే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇతర కరోనా వేరియంట్ల కంటే దక్షిణాఫ్రికాలో కనిపించిన ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వేరియంట్ ప్రాణాంతకమని, కొద్దినెలల్లోనే మిలియన్లకు పైగా కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయని WHO డైరెక్టర్ జనరల్ Tedros Adhanom Ghebreyeus హెచ్చరిస్తున్నారు. కొన్నివారాలుగా ఒమిక్రాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోందని, 10వారాల క్రితమే 90 మిలియన్ల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని WHO చీఫ్ హెచ్చరిస్తున్నారు. కరోనావైరస్ (Covid-19) మహమ్మారి ప్రారంభమైన 2020 మొత్తం ఏడాది కంటే ఎక్కువగా నమోదయ్యాయని టెడ్రోస్ అన్నారు.

ఇప్పటికే చాలా దేశాలు కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్లు, కర్ఫ్యూలు వంటి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. అయినప్పటికీ ఈ కరోనా విలయతాండవం ఆగడం లేదు. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరుగుతూనే ఉన్నాయి. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసుల తీవ్రత కూడా భారీగానే కనిపిస్తోంది. ఒమిక్రాన్ బారినపడిన వారిసంఖ్య పెరుగుతూ పోతోంది. కాకపోతే ఒమిక్రాన్ కారణంగా మరణాల సంఖ్య గతంలో వేరియంట్ల కంటే తక్కువగా ఉన్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

కరోనా కేసుల తీవ్రత పెరగడానికి కారణాలపై అనేక భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. చాలా దేశాలు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా లాక్ డౌన్, ఆంక్షలను సడలించడంతో తగ్గన కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ మునుపటి వేరియంట్ల కన్నా తక్కువ తీవ్రమైనది అయినప్పటికీ తక్కువ అంచనా వేయకూడదని టెడ్రోస్ అధనామ్ హెచ్చరిస్తున్నారు. అయితే ప్రపంచంలో ని చాలా దేశాల్లో ఒమిక్రాన్ మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.

ఆంక్షలు ఎత్తివేతతో పెరుగుతున్న కరోనా కేసులు :
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లతో వైరస్ ప్రభావాన్ని కొద్దిగా తగ్గించాయనే చెప్పాలి. కొన్ని వ్యాక్సిన్ల ప్రభావంతో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ అది పూర్తి స్థాయిలో సాధ్యపడదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రాన్ వంటి అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ తక్కువ తీవ్రత కారణంగా దాని వ్యాప్తిని నిరోధించడం ఇకపై సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ కరోనావైరస్ ఎంత ప్రమాదకరమైనదో రెండేళ్లుగా మన కళ్లముందే కొనసాగుతున్న విలయతాండవాన్ని చూస్తుంటే అర్థమవుతుందని WHO చీఫ్ టెడ్రాస్ అభిప్రాయపడ్డారు.

ఈ వైరస్ ను పూర్తి స్థాయిలో నిర్మూలించడం కష్టసాధ్యమేనని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతాలలో నాలుగు చోట్ల ఒమిక్రాన్ మరణాలు పెరగడం చూస్తూనే ఉన్నామని అన్నారు. ఇప్పటికే ఐర్లాండ్, బ్రిటన్, ఫ్రాన్స్ నెదర్లాండ్స్‌ సహా యూరోపియన్ దేశాలు విధించిన లాక్‌డౌన్లు, ఆంక్షలను సడలిస్తున్నాయి. జనవరి ఆఖరిలో ఫిన్లాండ్ COVID-19 ఆంక్షలను ఎత్తేసింది. కరోనా ఆంక్షలను డెన్మార్క్ ప్రభుత్వం రద్దు చేసింది. COVID-19 అనేది ప్రాణాంతక వ్యాధిగా పరిగణించది. 5.8 మిలియన్ల మంది ఉన్న దేశంలో ఇటీవలి వారాల్లో రోజుకు 50వేల కంటే ఎక్కువ కొత్త కరోనా కేసులు నమోదయయ్యాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో కరోనా బాధితుల సంఖ్య మాత్రం తగ్గింది.

కరోనా పోలేదింకా.. సడలింపులకు సరైన సమయం కాదు :
ప్రపంచ దేశాలన్నీ కరోనా నిబంధనలు, లాక్ డౌన్లు, ఆంక్షలను ప్రస్తుత పరిస్థితుల్లో సడలించడం సరైన సమయం కాదని, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని తాము ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నామని చెప్పారు. కరోనా ఆంక్షలను ఒకేసారి ఎత్తేయకుండా విడతల వారీగా ఎత్తివేయాలని WHO అధికారి మరియా వాన్ కెర్‌ఖో సూచించారు. అధిక టీకా రేట్లు కలిగిన దేశాల్లో కరోనా ఆంక్షలను సడలించాలా వద్దా అనేదానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయని WHO ఎమర్జెన్సీ చీఫ్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు.

ఎపిడెమియాలజీ ప్రకారం..
ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత ఎంత స్థాయిలో ఉంది.. ప్రజలపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతోంది.. అలాగే జనాభాలో రోగనిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందనే అంశాలను ముందుగా అంచనా వేయాల్సి ఉంటుందని మైఖేల్ ర్యాన్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ సంబంధిత చర్యలు చేపట్టడం ద్వారా కరోనాతో పోరాడటం సాధక్యపడుతుందని తెలిపారు. ప్రతి దేశం.. తమ దేశంలో కరోనా పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అంచనా వేయాలని, అందుకు తగినట్టుగా కరోనా కట్టడి చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేతప్పా.. ఇతర దేశాలు అమలు చేస్తున్న వాటిని గుడ్డిగా చూసి ఫాలో కావొద్దని ఆయన సూచించారు.

రాజకీయ ఒత్తిడుల కారణంగానే..
రాజకీయ ఒత్తిడులతో.. కొన్ని దేశాల్లో ముందుగానే లాక్ డౌన్లు, ఆంక్షలు ఎత్తేస్తున్నారని, తద్వారా కరోనా వ్యాప్తితో పాటు తీవ్రమైన వ్యాధికి దారితీసి క్రమంగా మరణానికి దారితీస్తుందని మైఖేల్ ర్యాన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. కరోనావైరస్ వంటి కొత్త వేరియంట్ల ఆవిర్భావాన్ని పరిశీలించేందుకు, దాని మూలాలను అంచనా వేసేందుకు గత ఏడాదిలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది WHO. రాబోయే వారాల్లో దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేస్తుందని చెప్పారు. ఈ నిపుణుల బృందం కరోనా పుట్టుక సంబంధించి మాత్రమే కాకుండా ప్రారంభంలో కరోనా.. ఇప్పటి కరోనాకు మధ్య జరిగిన పరిణామాలపై అధ్యయనాలు మరింతగా జరగాల్సి ఉందని పరిశోధక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా మూలం ఇక్కడేనా? :
ఇఫ్పటివరకూ కరోనా ఎలా పుట్టుకొచ్చింది.. దాని మూలాల ఎక్కడ అనేది కచ్చితమైన డేటా అందుబాటులో లేదు. కానీ, చైనా వుహాన్ సిటీలోనే ముందుగా కరోనావైరస్ ఉద్భవించినట్టు ప్రపంచమంతా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే WHO నేతృత్వంలోని మరొక బృందం చైనాకు వెళ్లింది. WHO నిపుణుల బృందం చైనాకు వెళ్లి కరోనా మూలాలపై అధ్యయనాలు చేసింది. గత ఏడాది మార్చిలో కరోనా వ్యాప్తిపై నివేదించింది. కరోనా నియంత్రణంపై కచ్చితమైన డేటా తెలియాలంటే చైనీస్ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసిన మునుపటి అధ్యయనాలపై ఆధారపడి ఉంటుందని WHO చీఫ్ తెలిపారు.

Read Also : Diabetes : మధుమేహ నియంత్రణకు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?..