Diabetes : మధుమేహ నియంత్రణకు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?..

కడుపు నిండా ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే అసలు తినకుండా ఉండకూడదు. నాలుగు గంటలకు ఒకసారి తగుమోతాదులో ఆహారం తీసుకోవటం మంచిది.

Diabetes : మధుమేహ నియంత్రణకు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?..

Diabetes

Diabetes : పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మనం తీసుకుంటున్న ఆహారం వల్ల అనేక రకాల రోగాలు వయసుతో సంబంధం లేకుండా వచ్చిపడుతున్నాయి. అందులోను ఇప్పుడు మధుమేహం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ మదుమేహం ఒకసారి వచ్చిదంటే ఇక జీవితకాలంలో మందులు వాడాల్సిందే. అసలు రాకుండా ఉండటానికి మన ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

అలాగే మధుమేహం తో బాధపడుతున్న వారు అవి తినకూడదు…ఇవి తినకూడదు అని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. అసలు మధుమేహం ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే నియంత్రణలో ఉంటుందన్న విషయాన్ని పలువురు వైద్యనిపుణులు కొన్ని సూచనలు చేశారు. పప్పు దినుసులు నుండి లభించే ప్రొటీన్లు, మాంసాహారం నుండి లభించే ప్రొటీన్లకంటే మేలైనవి. ధాన్యాలు, పప్పులు కలిపి తీసుకున్న ఆమారం ప్రొటీన్ల శాతాన్ని పెంచుతుంది. పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉండి, తక్కువ కేలరీలు ఉంటాయి. పుట్టగొడుగులు తీసుకోవచ్చు.

పీచు అధికంగా ఉండే ఆహారపదార్ధాలు మధుమేహం నివారణలో రక్తంలో కొవ్వు పదార్ధాలను తగ్గించటంలో సహాయపడతాయి. అన్ని పప్పు దినుసులలో ఆకుకూరలు, కూరగాయలలో పీచు అధికంగా ఉంటుంది. మొలకెత్తిన మెంతులు, పొడి చేసిన మెంతులలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. వీటిని చికిత్సకు సహాయకారిగా తీసుకోవచ్చు. పుల్కాలు, కూరగాయలు, పప్పులు చాలా తక్కవ నూనెతో వండుకుని తినాలి. వేపుడు పదార్ధాలని తీసుకోవటం మానుకోవాలి. సమయం ప్రకారం ఆహారం తీసుకోవటం ఉత్తమం.

కడుపు నిండా ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే అసలు తినకుండా ఉండకూడదు. నాలుగు గంటలకు ఒకసారి తగుమోతాదులో ఆహారం తీసుకోవటం మంచిది. మధుమేహంతో బాధపడేవారు తెల్లగుమ్మడి, సొరకాయ, వంకాయ, దోసకాయ, బెండకాయ, ములగకాయ, గోరు చిక్కుడు, పొట్లకాయ, టమాట, ఉల్లిపాయలు, క్యాబేజీ, బీన్స్, అల్లం, కొత్తిమీర అన్ని రకాల ఆకుకూరలు, తీసుకోవచ్చు. నీరు ఎక్కవగా తాగాలి.

చక్కెర, తేనె, జామ్, బెల్లం, వంటి తీపి వస్తువులు, కేకులు, చల్లనిపానీయాలు, మత్తు పానీయాలు, హార్లిక్ష్, బూస్ట్, బోర్నవిటా, కాంప్లాన్, ఖర్జూరం, ద్రాక్ష, మొదలైన వాటిని తీసుకోకుండా ఉండటం మంచిది. వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల తీసుకోపోవటం మంచిది. బంగాళ దుంపచ కంద, చేమచ చిలకడదుంప, మొదలైనవి తికూడదు. క్యారెట్, బఠానీచ బీట్ రూట్, మితంగా తీసుకోవాలి.