రావయ్యా సేనాని.. తిరుపతిలో బీజేపీ, జనసేన మధ్య ఏం జరుగుతోంది?

రావయ్యా సేనాని.. తిరుపతిలో బీజేపీ, జనసేన మధ్య ఏం జరుగుతోంది?

Bjp Janasena

Bjp Janasena Alliance: తిరుపతిలో రాజకీయం మరింత వేడెక్కింది. ఎంపీ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా.. నామినేషన్లు వేస్తున్నారు. ప్రధాన పార్టీల్లో సీనియర్లు సీన్‌లోకి దిగి గెలిచేందుకు ప్రిపేర్ చేస్తున్నారు. మంత్రులు జనాల్లోకి పోతున్నారు. తిరుపతి ఎవరిదన్నది తేల్చుకునేందుకు.. అన్ని పార్టీల లీడర్లు.. అస్త్రశస్త్రాలతో బరిలోకి దిగారు.

అభ్యర్థిని ప్రకటించపోయినా.. బీజేపీ నేతలు చాలా రోజుల ముందే తిరుపతిలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తిరుపతిలోనే మకాం వేసి బీజేపీ.. ఉపఎన్నికతో రాష్ట్రంలో సత్తాచాటాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా.. జనసేన సహకారంతోనే ఎన్నికల్లో ముందుకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. అభ్యర్థి ఫైనల్ అయ్యాక.. జనసేన తమతో కలిసి ప్రచారం చేస్తుందని చెబుతున్నప్పటికీ, ప్రస్తుతానికి జనసేన సహకరించట్లేదు.

తిరుపతి ఎంపీ ఉపఎన్నిక.. బీజేపీకి పెద్ద సవాల్‌గా మారగా.. ఉప ఎన్నికతో తమకెలాంటి సంబంధం లేదంటున్నారట జనసేనాని పవన్ కళ్యాణ్. సింపుల్‌గా చెప్పాలంటే.. తిరుపతి ఉపఎన్నికకు జనసేన అధినేత పూర్తిగా దూరంగా ఉండనున్నారు. తిరుపతి ఎన్నికల్లో జనసేన కీలకం కానుండగా.. వారు సీటు వదిలేసుకున్నారు.. ప్రచారాన్ని కూడా లైట్ తీసుకున్నారు. జనసేనాని లేకుండా బీజేపీ డీల్ చేయలేదు. పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్‌కి రానని కచ్చితంగా చెప్పేయడంతో.. బీజేపీకి కొత్త పెయిన్ స్టార్ట్ అయ్యింది.

మరోవైపు ఎలాగైనా సేనానిని తిరుపతి ప్రచారానికి తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నారు కమలనాథులు. తిరుపతి ఎంపీ స్థానం ఖాళీ అయినప్పుడే.. జనసేన తరఫున అభ్యర్థిని పోటీలో పెట్టాలని ఆ పార్టీ భావించింది. అయితే.. బీజేపీ పట్టుబట్టడంతో.. పోటీ నుంచి తప్పుకొని కమలం పార్టీకి మద్దతిచ్చారు. కానీ.. ఆ సపోర్ట్ అయిష్టంగానే ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందుకే.. తిరుపతి ఉపఎన్నికకు పవన్ పూర్తిగా దూరంగా ఉండబోతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి సైలెంట్‌గా ఉన్నట్లే.. తిరుపతి ఉపఎన్నికలోనూ అదే ఫాలో అవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. సేనాని క్యాంపెయిన్ చేస్తే.. ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారట బీజేపీ నేతలు. తిరుపతి బైపోల్ విషయంలో బీజేపీ, జనసేన మధ్య దూరం పెరిగిందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.