కరోనా బాధితుల్లో మెదడులో మంట.. రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది!

కరోనా బాధితుల్లో మెదడులో మంట.. రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది!

Blood vessel damage and inflammation : కరోనా సోకిన వ్యక్తుల్లో ఎక్కువగా రక్త నాళాలు దెబ్బతినడం, మంట రావడం.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపి క్రమంగా దెబ్బతీస్తోందని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో కరోనాతో మరణించిన వారిపై అధ్యయనం చేయగా వారిలో ఎక్కువగా మెదడు దెబ్బతినే అవకాశం ఉందని తేలింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ (NINDS)లోని శాస్త్రవేత్తలు మార్చి, జూలై 2020 మధ్య మరణించిన 19 కరోనావైరస్ రోగుల నుంచి మెదడు కణజాల నమూనాలను లోతుగా పరిశీలించారు. మెదడు కణజాల నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు మెదడు రక్త నాళాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు.

దీని ఫలితాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. SARS-CoV-2 వైరస్ సంక్రమణకు గురయ్యే రోగుల మెదడులో మైక్రోవాస్కులర్ రక్తనాళాల నష్టానికి గురయ్యే అవకాశం ఉందని కనుగొన్నారు. వైరస్‌కు శరీరం ఇన్ఫ్లమేటరీ వల్ల సంభవిస్తుందని ఫలితాలు సూచిస్తున్నాయని NINDS క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ అవింద్రనాథ్ తెలిపారు. మెదడు కణజాల నమూనాలలో దెబ్బతిన్నప్పటికీ, పరిశోధకులు ఆ కణజాలాలలో SARS-CoV-2 సంకేతాలను కనుగొనలేదు.

మెదడుపై నేరుగా వైరల్ దాడి చేయడంతో నష్టం జరగలేదని తేల్చేశారు. ప్రతి కరోనా బాధితుడు నుంచి మెదడు కణజాల నమూనాలను పరిశీలిచేందుకు.. పరిశోధకులు చాలా ఆస్పత్రుల్లో నాలుగు నుంచి 10 రెట్లు ఎక్కువ MRI స్కానర్‌ను ఉపయోగించారు. సూక్ష్మదర్శిని కింద మచ్చలను మరింత దగ్గరగా పరిశీలించగా.. పరిశోధకులు సన్నని లీకైన రక్త నాళాలు, మంట ఉన్నట్టుగా ధ్రువీకరించారు. భవిష్యత్తులో, కరోనా మెదడు రక్త నాళాలకు ఎంతవరకు హాని కలిగిస్తుందో అధ్యయనాలు అవసరమని అంటున్నారు.