ముందే జాగ్రత్త పడండి : 13 రోజులు బ్యాంకులు బంద్!

  • Published By: madhu ,Published On : February 28, 2020 / 02:41 PM IST
ముందే జాగ్రత్త పడండి : 13 రోజులు బ్యాంకులు బంద్!

బ్యాంకులకు సెలవులే సెలవులు. ఎందుకంటే..ఒక్క నెలలోనే 13 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. ఇప్పటికే సరిపడా నగదు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి 29వ తేదీ తర్వాత..మార్చి నెలలో బ్యాంకులు ఏకంగా 13 రోజులు పాటు బంద్ కానున్నాయి. జాతీయ సెలవులు, వారాంతపు లీవులు, ప్రాంతీయ హాలీడేస్ ఇందులో ఉన్నాయి.

మొత్తం 31 రోజులున్న మార్చి నెలలో కేవలం 18 రోజుల పాటే బ్యాంకులు పని చేయనున్నాయి. అంతేగాకుండా..ఈనెలలోనే పండుగలు కూడా వస్తున్నాయి. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు బ్యాంకులు సమ్మెలోకి వెళ్లనున్నాయి. ఒకవేళ సమ్మెలోకి వెళ్లకపోతే..మాత్రం…9 రోజుల పాటు బ్యాంకులు తెరుచుకోవు. 

* 1 st Sunday
* 8 th Sunday
* 9 th & 10th Holi
* 11 th, 12th and 13th Bank strike
* 14 th Second Saturday

* 15 th Sunday
* 22 nd Sunday
* 28 th Fourth Saturday
* 29 th Sunday
* 31 st Bank closing.
 

– 13 days bank closed in March, 2020.