IBM Layoffs: ఉద్యోగాల కోతలో ఐబీఎమ్ వంతు.. 3,900 మంది ఉద్యోగుల్ని తొలగించనున్న సంస్థ

3,900 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు ఐబీఎమ్ ప్రకటించింది. ఐబీఎమ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాఫ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. సంస్థలో వివిధ హోదాల్లోని ఉద్యోగుల్ని తొలగించినప్పటికీ, ఇంకొన్ని విభాగాల్లో కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు.

IBM Layoffs: ఉద్యోగాల కోతలో ఐబీఎమ్ వంతు.. 3,900 మంది ఉద్యోగుల్ని తొలగించనున్న సంస్థ

IBM Layoffs: ఐటీ సహా వివిధ రంగాల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విట్టర్ వంటి సంస్థలు వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఇప్పుడీ జాబితాలోకి ఐబీఎమ్ సంస్థ కూడా చేరబోతుంది. 3,900 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు ఐబీఎమ్ ప్రకటించింది.

Tamilisai: తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: గవర్నర్ తమిళిసై

ఐబీఎమ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాఫ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. సంస్థలో వివిధ హోదాల్లోని ఉద్యోగుల్ని తొలగించినప్పటికీ, ఇంకొన్ని విభాగాల్లో కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. అమెరికా డాలర్ విలువ క్షీణత వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందువల్ల ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. ఐబీఎమ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది కంపెనీ వృద్ధి 12 శాతం క్షీణించింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు చవిచూసింది. కంపెనీ షేర్లు కూడా 2 శాతం పడిపోయాయి. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి అనేక కారణాలతో ప్రస్తుతం అనేక కంపెనీలు నిర్వహణా వ్యయాల్ని తగ్గించుకునే పనిలో ఉన్నాయి.

Republic Day Celebrations: ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయంటే

దీనిలో భాగంగా ఉద్యోగాల కోత చేపడుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎమ్ వంటి సంస్థలు అన్నీ కలిపి ఇప్పటివరకు 44,000 మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికన్ కంపెనీ అయిన ఐబీఎమ్ సంస్థ 110 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ సంస్థకు అనేక దేశాల్లో ఉద్యోగులు ఉన్నారు. అమెరికాకంటే ఇతర దేశాల నుంచి సగంకంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ఏయే దేశాలకు వర్తిస్తుందో ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 280,000 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్ సేవలు మందగించాయి. ఇతర వ్యాపారాల్లోనూ స్తబ్ధత నెలకొంది. దీంతో కంపెనీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.