Red Hat Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన రెడ్‌ హ్యాట్.. 760 మందిని తొలగించేందుకు నిర్ణయం ..

రెడ్ హ్యాట్ సీఈఓ మాట్ హిక్స్ ఉద్యోగులకు ఇ మెయిల్ ద్వారా రాబోయే ఉద్యోగాల కోత గురించి వారికి తెలియజేశారు.

Red Hat Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన రెడ్‌ హ్యాట్.. 760 మందిని తొలగించేందుకు నిర్ణయం ..

Red Hat Layoffs

Red Hat Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాద్యం నేపథ్యంలో ఐటీ, టెక్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో తొలుత ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటికే మైక్రో సాప్ట్, గూగుల్, ట్విటర్, ఐబీఎం వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా వాటి స్థానంలో ఓపెన్ సోర్స్ సొల్యూషన్ ప్రొవైడర్ రెడ్ హ్యాట్ చేరింది. ప్రపంచ వ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో 4శాతం మంది అంటే 760 మందిని ఇంటిబాట పట్టించేందుకు సిద్ధమైంది. నార్త్ కరోలినా ఆధారిత సాప్ట్‌వేర్ మేజర్ కంపెనీలో 19వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Amazon Layoffs: అయ్యో.. మరోసారి ఉద్యోగులకు షాకిచ్చిన అమెజాన్‌.. భారీగా తొలగింపు

రెడ్ హ్యాట్ సీఈఓ మాట్ హిక్స్ ఉద్యోగులకు ఇ మెయిల్ ద్వారా రాబోయేరోజుల్లో ఉద్యోగాల తొలగింపు గురించి వారికి తెలియజేశారు. కొత్త వాతావరణంలో పోటీపడే రెడ్ హ్యాట్ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఈ నిర్ణయం ఇప్పుడు సరైందని చెప్పాడు. కొన్ని దేశాల్లోని ఉద్యోగులకు వెంటనే లేఆఫ్‌ల గురించి తెలియజేయడంజరిగిందని, మరికొందరికి ప్రస్తుత ఆర్థిక త్రైమాసికంలో తెలియజేయడం జరుగుతుందని మాట్ హిక్స్ అన్నారు.

Disney Layoffs: డిస్నీలో ఉద్యోగాల కోత.. ఎవరిని తొలగించాలో గుర్తించాలని మేనేజర్లకు ఆదేశం

ఇదిలాఉంటే ఓపెన్ సోర్స్ సొల్యూషన్స్ లీడర్ రెడ్ హ్యాట్ కంపెనీని ప్రముఖ సాప్ట్ వేర్ దిగ్గజం ఐబీఎం సంస్థ 2019 లో కొనుగోలు చేసింది. 34 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మన కరెన్సీలో డీల్ విలువ దాదాపు రూ. 2.42 లక్షల కోట్లకు సమానం.