Disney Layoffs: డిస్నీలో ఉద్యోగాల కోత.. ఎవరిని తొలగించాలో గుర్తించాలని మేనేజర్లకు ఆదేశం

కొంతకాలంగా డిస్నీ సంస్థ నిర్వహణా ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ ఏడాది నుంచి ఐపీఎల్ ప్రసారాల్ని అందించడం లేదు. కొన్ని హాలీవుడ్ సినిమాల్ని కూడా త్వరలో ఓటీటీ నుంచి తొలగించనుంది. హెచ్‌బీఓ షోలు, సినిమాలు కనిపించవు.

Disney Layoffs: డిస్నీలో ఉద్యోగాల కోత.. ఎవరిని తొలగించాలో గుర్తించాలని మేనేజర్లకు ఆదేశం

Disney Layoffs: టెక్ సంబంధిత సంస్థల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. త్వరలో డిస్నీ సంస్థ కూడా ఉద్యోగుల్ని తొలగించనుంది. ఈ మేరకు వచ్చే నెలలో 4,000 మంది ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించింది. ఎవరిని తొలగించాలో నిర్ణయించాల్సిందిగా మేనేజర్లకు డిస్నీ సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

New Delhi: దారుణం.. నడిరోడ్డు మీద యువతిపై దాడి చేసి, కారులోకి తోసిన యువకుడు.. వైరల్ వీడియో

కొంతకాలంగా డిస్నీ సంస్థ నిర్వహణా ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ ఏడాది నుంచి ఐపీఎల్ ప్రసారాల్ని అందించడం లేదు. కొన్ని హాలీవుడ్ సినిమాల్ని కూడా త్వరలో ఓటీటీ నుంచి తొలగించనుంది. హెచ్‌బీఓ షోలు, సినిమాలు కనిపించవు. కంటెంట్ భారాన్ని తగ్గించుకున్న సంస్థ ఇప్పుడు ఉద్యోగాల కోతకు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ 3న కంపెనీ వార్షిక సమావేశం జరగబోతున్న నేపథ్యంలో, ముందుగానే డిస్నీ ఈ నిర్ణయం తీసుకుంది.

కంపెనీలో 7,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు సీఈవో బాబ్ ఐగర్ గత ఫిబ్రవరిలోనే ప్రకటించారు. కంపెనీ నిర్వహణలో మార్పులు చేయడం, వ్యయ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు, వేతనాలు తగ్గించడం వంటివి కూడా చేస్తామని ఆయన చెప్పారు. 5.5 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.