Komaki E-Scooter : వృద్ధులు, వికలాంగుల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్

వృద్ధులు, వికలాంగుల కోసం ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ కొమాకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తెచ్చింది.

Komaki E-Scooter : వృద్ధులు, వికలాంగుల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్

Electric Scooter

E-Scooter For Specially Abled Riders : ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ కొమాకి వృద్ధులు, వికలాంగులకు తీపి కబురు అందించింది. వారి కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తెచ్చింది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది.

మెకానికల్ పార్కింగ్ వంటి భద్రతా ఫీచర్లతో కొత్త ఎక్స్ జీటీ ఎక్స్5ను ప్రారంభించింది. ఈ ఎక్స్ జీటీ-ఎక్స్5 (72వి24ఎహెచ్) ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ధర రూ.90,500(ఎక్స్ షోరూమ్), ఎక్స్ జీటీ-ఎక్స్5 జీఈఎల్ రిటైల్స్ ధర రూ.72,500 (ఎక్స్ షోరూమ్)గా ఉంది.

ఎక్స్ జీటీ ఎక్స్5 1,000 యూనిట్లను ఇప్పటికే విక్రయించట్లు ఈవీ తయారీదారు ప్రకటించింది. ఈ మోడల్ కొనుగోలు చేయడానికి దేశ వ్యాప్తంగా కంపెనీకి చెందిన అన్ని షోరూమ్ ల్లో లభ్యం అవుతుంది. ఈ స్కూటర్ ను ఆన్‌లైన్‌ లో ఉచితంగా బుక్ చేస్తే సమీప డీలర్ ద్వారా డెలివరీ చేయనున్నారు. కోమాకి మోడల్స్ పై ఈఎమ్ఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

కొత్త కోమాకి ఎక్స్ జీటీ-ఎక్స్5 రెండు(ఎరుపు, బూడిద) రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ను ఒక సారి ఛార్జ్ చేస్తే 80-90 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇది విఆర్ఎల్ఎజెల్ బ్యాటరీలు, లిథియం-అయాన్ బ్యాటరీలతో రెండింటితో పనిచేస్తుంది. దీనిలో రీ-జనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.