UPI డబుల్ మైల్ స్టోన్ : 10కోట్ల యూజర్లు.. 100 కోట్ల ట్రాన్సాక్షన్లు

  • Published By: sreehari ,Published On : October 28, 2019 / 10:33 AM IST
UPI డబుల్ మైల్ స్టోన్ : 10కోట్ల యూజర్లు.. 100 కోట్ల ట్రాన్సాక్షన్లు

భారత డొమిస్టిక్ పేమెంట్స్ ప్లాట్ ఫాం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) డబుల్ మైల్ స్టోన్ దాటేసింది. దేశంలో లాంచ్ అయిన మూడేళ్ల తర్వాత అక్టోబర్ నెలలో UPI ఒక బిలియన్ (100 కోట్ల లావాదేవీలు) ట్రాన్సాక్షన్ ల్యాండ్ మార్క్ చేరుకుంది. అంతేకాదు… 10 కోట్ల యూజర్ల మార్క్ ను సైతం UPI దాటేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో యూపీఐ పేమెంట్స్ విధానం అత్యంత వేగవంతంగా మారింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ అరుదైన రికార్డును UPI ద్వారా సృష్టించింది. 

ఈ యూపీఐ ప్లాట్ ఫాం నెట్ వర్క్ ను త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు NPCI ప్లాన్ చేస్తోంది. ముందుగా సింగపూర్, UAE వంటి దేశాల్లో UPI నెట్ వర్క్ ఎనేబుల్ చేయాలని కంపెనీ కసరత్తు చేస్తోంది. దీనిపై ఎన్ పీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ దిలీప్ అస్బే మాట్లాడుతూ.. ‘యూపీఐ పేమెంట్స్.. కేవలం చెల్లింపుల్లో మాత్రమే వేగవంతం కాదని, ఇతర ప్లాట్ ఫాంలపై కూడా అంతే వేగవంతంగా దూసుకెళ్తుందని అన్నారు.

సోషల్ మీడియా, ఇతర ప్లాట్ ఫాంల ద్వారా 10 కోట్ల మంది UPI యూజర్లకు చేరిందని చెప్పారు. మరికొన్ని రోజుల్లో మరింత ఉన్నత స్థితికి చేరుకుంటామనే నమ్మకం ఉందని అస్బే అభిప్రాయపడ్డారు. ఆగస్టు నెలలో మొత్తం అన్ని కార్డుల (డెబిట్, క్రెడిట్)పై లావాదేవీలు కలిపి 1.42 బిలియన్లు (142కోట్లు)గా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. 

UPI అంటే ఏంటి?
2016లో పెద్ద నోట్ల రద్దుకు ముందుగానే UPI ప్లాట్ ఫాంను ప్రవేశపెట్టడం జరిగింది. ఒక బ్యాంకు అకౌంట్ నుంచి మరొకరి బ్యాంకు అకౌంటుకు నగదును పంపేందుకు ఈ UPI పేమెంట్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. బ్యాంకు అకౌంట్ వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈమెయిల్ అకౌంట్ లేదా QR code స్కానింగ్ చేయడం ద్వారా ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించేందుకు వీలుగా Ru-Pay నెట్ వర్క్ ను NPCI లాంచ్ చేసింది.