Flipkartలో ఫస్ట్ టైం సేల్ : Redmi 8A ఫోన్‌‌పై డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్  

  • Published By: sreehari ,Published On : September 30, 2019 / 12:29 PM IST
Flipkartలో ఫస్ట్ టైం సేల్ : Redmi 8A ఫోన్‌‌పై డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్  

చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి A కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లలోకి వచ్చింది. అదే.. Redmi 8A సిరీస్. రెడ్ మి 7Aతో సక్సెస్ సాధించిన రెడ్ మి కంపెనీ 8A సిరీస్ ను మార్కెట్లోకి దించింది. గతవారమే లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్లో 5,000mAh బ్యాటరీతో పాటు 12MP ప్రైమరీ స్నాపర్ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. చౌకైన ధరకే రెండు వేరియంట్లలో Redmi 8A సిరీస్ మోడల్ అందుబాటులో ఉంది. 2GB ర్యామ్ తో 32GB స్టోరేజీ ఒక వేరియంట్ కాగా.. 3GB ర్యామ్, 32GB స్టోరేజీతో మరో వేరియంట్ లభ్యం అవుతోంది. ఇందులో 6.2 అంగుళాల HD+డిస్ ప్లేతో వాటర్ డ్రాప్ నాచ్, 19:9 యాస్పెక్ట్ రేషియోతో వచ్చింది. 

ఇందులో స్నాప్ డ్రాగన్ 439 SoC ఉంది. వైర్ లెస్ FM రేడియోతో పాటు 5,000mAh బ్యాటరీ కూడా ఉంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే ఐదు రోజుల వరకు వస్తుంది. USB Type-C ఛార్జింగ్ పోర్ట్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. 12MP రియర్ కెమెరాతో సోనీ IMX363 సెన్సార్, సెల్ఫీ కెమెరా (ఫ్రంట్) 8MP వరకు ఉంది. కనెక్టవిటీ ఆప్షన్లలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ v5.0, GPS/FM రేడియో, USB Type-C, 3.5mm హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Redmi 8A సిరీస్ రెండు వేరియంట్లలో 2GB RAM + 32GB స్టోరేజీ ధర రూ.6వేల 499గా నిర్ణయించగా.. 3GB RAM + 32GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 6వేల 999గా నిర్ణయించారు. 

ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, ఒసియన్ బ్లూ, సన్ సెట్ రెడ్.. మొత్తం మూడు కలర్లలో లభ్యం కానుంది. ఆసక్తిగల వినియోగదారులు.. Redmi 8A సిరీస్ ఫోన్.. Mi.com, Flipkart వెబ్ సైట్ల నుంచి ఆర్డర్లు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 నుంచి Mi Home స్టోర్లలో ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానుంది. Redmi 8A స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై.. Flipkart – AXis బ్యాంకు క్రెడిట్, HDFC డెబిట్ కార్డు, AXis బ్యాంకు బజ్ క్రెడిట్ కార్డులపై 5 శాతం డిస్కౌంట్ లేదా క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.