SBI Card Charges : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. ఇక నుంచి రూ.99 సర్వీస్ ఛార్జ్

తన క్రెడిట్ కార్డు ఖాతాదారులకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులో ఇంటి అద్దె చెల్లిస్తుంటే.. రేపటి నుంచి అంటే నవంబర్ 15వ తేదీ నుంచి రూ.99 సర్వీస్ ఛార్జి వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనికి 18శాతం జీఎస్టీ అదనం.

SBI Card Charges : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. ఇక నుంచి రూ.99 సర్వీస్ ఛార్జ్

SBI Card Charges : మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజరా? క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మీ జేబుపై మరింత భారం పడనుంది. తన క్రెడిట్ కార్డు ఖాతాదారులకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులో ఇంటి అద్దె చెల్లిస్తుంటే.. రేపటి నుంచి అంటే నవంబర్ 15వ తేదీ నుంచి రూ.99 సర్వీస్ ఛార్జి వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనికి 18శాతం జీఎస్టీ అదనం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అలాగే ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ప్రాసెసింగ్ ఫీజు రూ.99గా ఉంది. దాన్ని రూ.199 చేసింది. దీనికి కూడా జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు తన కస్టమర్లకు ఎస్బీఐ మేసేజ్ లు పంపుతోంది.

SBI కార్డ్ మర్చంట్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) లావాదేవీలపైనా ప్రాసెసింగ్ ఫీజును సవరించింది. గతంలో రూ.99గా ఉన్న ఫీజును రూ.199కి పెంచింది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం.

వ్యాపారి EMI అనేది కార్డ్ సభ్యుడు ఏదైనా పాయింట్ ఆఫ్ సేల్ లేదా ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో రూ. 2,500 కంటే ఎక్కువ లావాదేవీలను సూచిస్తుంది, ఇక్కడ కార్డ్ సభ్యుడు కొనుగోలు మొత్తాన్ని EMIగా మార్చడానికి ఎంచుకుంటారు.

చాలా మంది క్రెడిట్ కార్డు యూజర్లు.. RedGiraffe, Cred, Paytm, Magicbricks సహా అనేక థర్డ్-పార్టీ వెబ్‌సైట్లు, యాప్‌లలో క్రెడిట్ కార్డులతో అద్దె చెల్లిస్తున్నారు.

అద్దె చెల్లింపు వ్యక్తులు చేసే అత్యధిక నెలవారీ ఖర్చుల్లో ఒకటి. కొన్నిసార్లు, సకాలంలో అద్దె చెల్లించడం కష్టంగా ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులను ఉపయోగించి రెంట్ చెల్లించవచ్చు. అయితే, కొత్త నిబంధనలతో కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారిపై మరింత భారం పడనుంది.

ఇప్పటికే పలు బ్యాంకులు క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులపై సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్నాయి. అద్దె చెల్లింపుపై 1 శాతం ఛార్జ్ చెల్లించాలని ఐసీఐసీఐ తన క్రెడిట్ కార్డు కస్టమర్లను కోరింది. అక్టోబర్ 20వ తేదీ నుంచి సర్వీస్ చార్జీ వసూలు చేస్తోంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు.. రెంట్ పేమెంట్స్ పై రివార్డ్ పాయింట్లను తగ్గించింది. ఇక Yes బ్యాంకు.. అద్దె చెల్లింపు లాంటి లావాదేవీలను నెలకు రెండు సార్లు మాత్రమే చేసుకునే అవకాశం ఇచ్చింది. క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించడం ద్వారా క్రెడిట్ వినియోగం పెరుగుతుంది కాబట్టి, ఇది క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపొచ్చని అంటున్నారు.