Xiaomi 12 Pro 5G Price : క్రోమాలో షావోమీ 12 ప్రో 5G ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Xiaomi 12 Pro 5G Price Cut : క్రోమాలో షావోమీ 12 ప్రో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ధర రూ.62,999కి లాంచ్ అయిన 5G షావోమీ ఫోన్ ధర తగ్గింపు ధరతో ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

Xiaomi 12 Pro 5G is available at Rs 27,999 on Croma, a deal you should consider
Xiaomi 12 Pro 5G Price Cut : ప్రముఖ క్రోమా (Croma)లో చాలా తక్కువ ధరకు (Xiaomi 12 Pro) అందుబాటులో ఉంది. భారత్ మార్కెట్లో రూ.62,999కి లాంచ్ అయిన షావోమీ 5G ఫోన్ రూ.27,999 ధర ట్యాగ్‌తో ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఈ ఆఫర్‌పై ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేవు. షావోమీ 12 ప్రోపై క్రోమా ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
క్రోమాలో షావోమీ 12 ప్రో 5G ఫోన్ ధర :
షావోమీ 12 ప్రో ధర రూ. 27,999కి పొందవచ్చు. అసలు ధర రూ. 62,999 నుంచి తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 35వేల తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ గడువు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అమెజాన్ అదే షావోమీ ఫోన్‌ను రూ. 39,999కి విక్రయిస్తోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ రూ. 49,999 ధరతో అందిస్తోంది.
షావోమీ 12 ప్రో 5G తక్కువ ధర ఎంతంటే? :
ఈ షావోమీ ఫోన్‌ని తక్కువ ధరకు కొనుగోలుకు చేయొచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ధర విభాగంలోని ఇతర ఫోన్‌ల కన్నా వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. దాంతో పాటు, వినియోగదారులు తక్కువ ధర వద్ద స్టోరేజీని కూడా పొందవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. రూ. 30వేల ధర పరిధిలో పోటీదారుల కన్నా మెరుగ్గా ఉంది.

Xiaomi 12 Pro 5G Price Cut
వెనుకవైపు మూడు 50MP కెమెరాలను పొందుతారు. అందులో ఒకటి టెలిఫోటో కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ కలిగి ఉంది. కంపెనీ బాక్స్‌లో 120W ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. ఈ డివైజ్ హుడ్ కింద తగినంత పెద్ద 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఇందులో 120Hz AMOLED LTPO స్క్రీన్ 6.73-అంగుళాల సైజులో ఉంటుంది. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌లలో చూడవచ్చు. మెరుగైన HD క్వాలిటీ ఎక్స్‌పీరియన్స్ కోసం స్క్రీన్ డాల్బీ విజన్, HDR10+ సర్టిఫికేట్ కూడా పొందింది. స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. IP53 రేటింగ్‌కు సపోర్టు ఇస్తుంది. షావోమీ 12 ప్రోతో పొందే సాధారణ బ్లోట్‌వేర్, ఇందులో షావోమీ-బ్రాండెడ్ యాప్‌లు, కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి.