Train Engine‌ Theft : ఏకంగా రైలు ఇంజిన్‌నే దొంగిలించి అమ్మేసిన రైల్వే ఇంజినీర్‌

రైలు ఇంజిన్‌ను పాతసామాన్లు కొనే మాఫియాకు అమ్మేశారు. నకిలీ ధ్రువపత్రాలను సృష్టించిన రాజీవ్‌ డిసెంబర్‌ 14న హెల్పర్‌ సాయంతో గ్యాస్‌ కట్టర్‌తో రైలు ఇంజిన్‌ను ముక్కలు ముక్కలుగా చేశాడు.

Train Engine‌ Theft : ఏకంగా రైలు ఇంజిన్‌నే దొంగిలించి అమ్మేసిన రైల్వే ఇంజినీర్‌

Train

railway engineer stole Train engine : రైల్లో దొంగతనం జరగడం కామన్‌. ఇవన్నీ మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ ఏకంగా రైల్‌ ఇంజన్‌నే దొంగిలించడం ఎప్పుడైనా చూశారా.. దొంగిలించిన ఇంజిన్‌ను అమ్మేయడం ఎక్కడైనా విన్నారా.. బీహార్‌ రాష్ట్రంలోని పుర్ణియా కోర్ట్‌ రైల్వేస్టేషన్‌లో మొదటిసారి ఓ రైల్‌ ఇంజినే పాతసామాన్లు కొనే మాఫియాకు అమ్మారు. రైలు ఇంజిన్‌ను దొంగిలించింది… అమ్మింది… బయటి దొంగలు అనుకునేరు. రైల్వేశాఖలోని ఇంటి దొంగలే ఈ పనికి పాల్పడ్డారు. ఓ రైల్వే ఇంజినీర్‌ ఏకంగా రైలు ఇంజిన్‌ను అమ్మేశాడు.

పుర్ణియా కోర్ట్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో సమస్తిపుర్‌ లోకో డీజిల్‌ షెడ్‌ ఉంది. ఇందులో రాజీవ్‌ రంజన్‌ ఝా ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పుర్ణియా స్టేషన్‌లో చిన్న రైల్వే ట్రాక్‌పై తిరిగే ఓ పాతరైలు ఇంజిన్‌ ఉంది. దీనిపై కన్నేశాడు రాజీవ్‌ రంజన్‌. దాన్ని ఎలాగైనా అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించాడు. అతడికి ఇన్‌స్పెక్టర్‌, హెల్పర్‌ కూడా తోడయ్యారు. ఇంకేముంది ముగ్గురూ కలిసి గుట్టుచప్పుడు కాకుండా రైలు ఇంజిన్‌ను …. పాతసామాన్లు కొనే ఓ మాఫియాకు అమ్మేశారు.

Falling Temperatures : తెలంగాణపై చలిపులి పంజా..గిన్నెదరిలో 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

నకిలీ ధ్రువపత్రాలను సృష్టించిన రాజీవ్‌.. డిసెంబర్‌ 14న హెల్పర్‌ సాయంతో గ్యాస్‌ కట్టర్‌తో రైలు ఇంజిన్‌ను ముక్కలు ముక్కలుగా చేశాడు. అక్కడున్న కొంతమంది అధికారులు దాన్ని అడ్డుకోగా నకిలీ ధువపత్రాలను చూపించాడు. ఇంజిన్‌ పాతదైపోయిందని.. విడిభాగాలుగా చేసి డీజిల్‌ షెడ్‌కు తరలించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారని వారిని నమ్మించాడు.

అయితే అదే స్టేషన్‌లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు, స్టేషన్‌ మాస్టర్‌కు రాజీవ్‌ రంజన్‌ తీరుపై అనుమానం వచ్చింది. వెంటనే వారంతా వెళ్లి చూడగా అక్కడ ఇంజిన్‌ పరికరాలు లేవు. దీంతో ఇదే విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో… వారంతా ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టగా నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో పుర్ణియా స్టేషన్​ డీఆర్ఎం అలోక్ అగర్వాల్ ఆదేశాల మేరకు రాజీవ్, వీరేంద్రతోపాటు వీరికి సహకరించిన హెల్పర్​ను సస్పెండ్ చేశారు.