karimnagar : కరీనంగర్ జిల్లాలో దారుణం : ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ప్రియుడు హత్య చేశాడు. నగరానికి చెందిన వరలక్ష్మి అనే యువతి కనపడటంలేదని మూడు రోజుల క్రితం క

karimnagar : కరీనంగర్ జిల్లాలో దారుణం : ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

karimnagar Young woman murder

Updated On : January 8, 2022 / 12:41 PM IST

karimnagar : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ప్రియుడు హత్య చేశాడు. నగరానికి చెందిన వరలక్ష్మి అనే యువతి కనపడటంలేదని మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న తిమ్మాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె సెల్ ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా దర్యాప్తు మొదలెట్టి ఆమె ప్రియుడు అఖిల్(22) నుఅదుపులోకి తీసుకుని విచారించారు.
Also Read : Vijayawada : విజయవాడలో కుటుంబం ఆత్మహత్య
పోలీసు విచారణలో వరలక్ష్మిని తానే హత్య చేసినట్లు అఖిల్ ఒప్పుకున్నాడు. పోలీసులను గ్రామ శివారుకు తీసుకు వెళ్లి హత్యచేసిన ప్రదేశాన్ని చూపించాడు. అక్కడ అప్పటికే వరలక్ష్మి మృతదేహం కుళ్లిపోయి… జంతువులు పీక్కుతిన్నాయి.