మామిడిపండ్ల దొంగతనం కేసు 12 ఏళ్ల తర్వాత తీర్పు

  • Published By: madhu ,Published On : December 11, 2020 / 12:04 PM IST
మామిడిపండ్ల దొంగతనం కేసు 12 ఏళ్ల తర్వాత తీర్పు

can’t even prove mango theft : మామిడిపండ్లను దొంగతనం, తోట యజమానిని చంపేందుకు ప్రయత్నించాడనే కేసులో 12 సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. దొంగిలించాడని, చంపడానికి ప్రయత్నించాడనే ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని additional sessions judge P.C. Kushwaha వెల్లడించారు.
Malihabad police station పరిధిలో తన తోటలో నుంచి మామిడి పండ్లను దొంగిలించేందుకు ప్రయత్నించారని  అంతేగాకుండా..తనను చంపడానికి యత్నించారని 2008లో మాలిహాబాద్ పోలీస్ స్టేషన్ లో Rashid Ali Beg అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.



పండ్లను దొంగిలించడాన్ని వ్యతిరేకించడంతో చంపడానికి ప్రయత్నించారని బేగ్ వెల్లడించారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు కొనసాగించారు. ఈ ఘటనలో Farid Pindari, Hafiz Abdul Rais లపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సుదీర్ఘంగా విచారణ సాగింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే.. Hafiz Abdul Rais చనిపోయాడు. దీంతో అతనిపై ఉన్న కేసును మూసివేశారు. Farid Pindari ఒక్కడిపై విచారణ జరిగింది. తాజాగా..దీనిపై additional sessions judge P.C. Kushwaha తీర్పును వెల్లడించారు. Farid Pindari పై ఉన్న ఆరోపణలను నిరూపించలేకపోవడంతో అతను నిర్దోషి అంటూ ప్రకటించారు. వ్యక్తిగత శతృత్వం కారణంగా ఈ ఆరోపణలున్నాయని వెల్లడించారు.