Ex-South Korean President : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్​ తై​-వూ(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తై-వూ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న క్రమంలో మంగళవారం తుదిశ్వాస

Ex-South Korean President : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

Korea

Ex-South Korean President దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్​ తై​-వూ(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తై-వూ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న క్రమంలో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు సియోల్​ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ వెల్లడించింది.

కాగా, కొరియా యుద్దం, వియత్నాం వార్ లో రోహ్​ తై​-వూ కీలక భూమిక పోషించారు. 1979లో జరిగిన సైనిక తిరుగుబాటుకు తై​-వూ నాయకత్వం వహించారు. అంతేకాకుండా తన స్నేహితుడు చున్​ దూ-వాన్ ​ను​ అధ్యక్షుడిని చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే సైనిక పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో 1987లో ఎన్నికలు నిర్వహించి అధ్యక్ష పదవికి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన తై​-వూ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. 1988-1993 మధ్య దక్షిణ కొరియా అధ్యక్షుడిగా రోహ్​ తై​-వూ పనిచేశారు. 1988లో సియోల్ ఒలింపిక్స్ నిర్వహించడంలో తై​-వూ కీలకపాత్ర పోషించారు.

అయితే తై​-వూపై వ్యతిరేకత ఆయన అధ్యక్ష పదవిని వీడాక కూడా వెంటాడింది. అయితే రాజద్రోహం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన జైలు శిక్ష కుడా అనుభవించారు. అనంతరం క్షమాభిక్ష పొంది జైలు నుంచి విడుదలైన తై​-వూ.. మిగిలిన జీవితాన్ని సమాజానికి దూరంగా ఉంటూ గడిపిన విషయం తెలిసిందే.

ALSON READ Elon Musk’s Fortune : ఒక్క రోజే 2.71లక్షల కోట్లు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద