UP CM Yogi Adityanath : ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ రక్తంతో సీఎం యోగికి లేఖ రాసిన స్కూల్ విద్యార్ధినిలు

ప్రిన్సిపాల్ తమకు లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలికలు సీఎం యోగి ఆదిత్యానాథ్ కు తమ రక్తంతో లేఖ రాశారు.

UP CM Yogi Adityanath : ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ రక్తంతో సీఎం యోగికి లేఖ రాసిన స్కూల్ విద్యార్ధినిలు

UP cm yogi adityanath

Uttar Pradesh : విద్యార్ధులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులే కీచకుల్లా మారుతున్నారు. విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది మౌనంగా వేధింపులను భరిస్తుంటే మరికొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్ లోని బమ్ హైతా గ్రామంలోని కాసాన్ ఆదర్శ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు చేస్తున్న వికృత చేష్టల్ని భరించలేని విద్యార్ధినులు సీఎం యోగీ ఆదిత్యానాథ్ (uttar pradesh cm yogi adityanath)కు లేఖ రాశారు. ఘజియాబాద్ (Ghaziabad)లోని ఓ స్కూల్లో విద్యార్ధినిలు ప్రిన్సిపాల్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని చర్యలు తీసుకోండి అని వేడుకుంటు తమ రక్తంతో లేఖ రాశారు. తమను పదే పదే వేధిస్తున్నాడని దీంతో తాము స్కూల్ కు రావాలంటేనే భయపడుతున్నామని ప్రిన్సిపాల్ రాజీవ్ పాండేపై చర్యలు తీసుకోవాలని కోరుతు సీఎం యోగీకి తమ రక్తంతో లేఖ రాశారు కొంతమంది విద్యార్ధినులు.

Raksha bandhan 2023 : జవాన్‌లకు రాఖీలు కట్టిన మహిళలు,చిన్నారులు

ప్రిన్సిపాల్ రాజీవ్ పాండే (Principal Rajeev Pandey)తమను అనుచితంగా తాకుతు ఇబ్బంది పెడుతున్నాడని..తమను వికృత చేష్టలతో వేధిస్తున్నాడంటూ 10,12 ఏళ్ల బాలికలు తమ రక్తంతో లేఖ రాశారు. ప్రిన్సిపాల్ కు భయపడి మౌనంగా వేధింపులకు భరించిన ఆ చిన్నారులు ఇక ఎన్నాళ్లు ఇలా భరించాలి…? ఈ విషయాన్ని పైవారికి తెలియజేయాలి అని నిర్ణయించుకుని సీఎం యోగికి లేఖ రాశారు. ప్రిన్సిపాల్ కు భయపడిన చాలాకాలంలో వేధింపులను భరిస్తున్నారు. వారి మౌనాన్ని అలుసుగా తీసుకున్న ప్రిన్సిపాల్ మరింతగా రెచ్చిపోయాడు. దీంతో బాధిత బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Raksha Bandhan 2023: రక్షాబంధన్ వేళ చెల్లి సెంటిమెంట్‌తో కన్నీరు పెట్టిస్తున్న క్రికెటర్.. వీడియో

తమ బాధను చెప్పుకోవటానికి తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో బాలికలు కోరారు. తమతో పాటు తమ తల్లిదండ్రులకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. తమ బాధను తమ తల్లిదండ్రులకు చెప్పగా కోపంతో వారు ప్రిన్సిపాల్ పై దాడి చేశారని..దీంతో ప్రిన్సిపాల్ తమ తల్లిదండ్రులను అసభ్యపదజాలంలో దూషించాడని అలా వాగ్వాదం జరిగి తరువాత అతను తమ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. తమను పోలీసులు బెదిరించి గంటల తరబడి నిర్భంధించారని విద్యార్థినులు లేఖలో పేర్కొన్నారు. పోలీసులు తమను, తమ తల్లిదండ్రులను నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టారని లేఖలో పేర్కొన్నారు. అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని లేఖలో ఆరోపించారు. మేమంతా మీ కుమార్తెల వంటి వారమని, మిమ్మల్ని కలిసి, తమపై జరిగిన వేధింపుల గురించి వ్యక్తిగతంగా చర్చించాలని అనుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు.