Raksha Bandhan 2023: రక్షాబంధన్ వేళ చెల్లి సెంటిమెంట్‌తో కన్నీరు పెట్టిస్తున్న క్రికెటర్.. వీడియో

రక్షా బంధన్ వేళ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Raksha Bandhan 2023: రక్షాబంధన్ వేళ చెల్లి సెంటిమెంట్‌తో కన్నీరు పెట్టిస్తున్న క్రికెటర్.. వీడియో

Wanindu Hasaranga

Raksha Bandhan 2023 – Wanindu Hasaranga: మరికొన్ని రోజుల్లో రక్షా బంధన్ జరుపుకోనున్నాం. అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, సినీనటుడు, క్రికెటర్, సామాన్యుడు.. ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి తమ సోదరితో పెనవేసుకున్న అనుబంధానికి దాసోహం అయ్యేవారే. తన సోదరికి పెళ్లయితే ఇక తనతో ఉండదని, ఆడదని, గొడవ పడదనే ఊహనే భరించలేకపోతారు కొందరు సోదరులు.

తన చెల్లికి పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతుందనే బాధతో శ్రీలంక క్రికెటర్, ఐపీఎల్‌(IPL)లో ఆర్సీబీ (RCB) ఆటగాడు వనిందు హసరంగా కన్నీరు పెట్టుకోవడం అందరి హృదయాలనూ కరిగిస్తోంది. తాజాగా ఆయన సోదరి పెళ్లి జరిగింది. అప్పగింతల వేళ ఆమె వనిందు హసరంగా ఆశీర్వాదం తీసుకుంది.

ఆ సమయంలో వనిందు హసరంగా కన్నీరు పెట్టుకున్నాడు. అతడిని చూసి పెళ్లికూతురు కూడా వలవలా ఏడ్చేసింది. రక్షా బంధన్ వేళ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


Raksha Bandhan 2023 : రాఖీ రోజు అక్కచెల్లెళ్లకు ఈ బహుమతులు ఇవ్వండి.. వారి కళ్లల్లో ఆనందం చూడండి