Raksha Bandhan 2023 : రాఖీ రోజు అక్కచెల్లెళ్లకు ఈ బహుమతులు ఇవ్వండి.. వారి కళ్లల్లో ఆనందం చూడండి

రాఖీ పండుగ రోజు అన్న చెల్లెలికి, తమ్ముడు అక్కకి రాఖీ కట్టించుకున్న తర్వాత బహుమతులు ఇస్తారు. తోబుట్టువులకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా? అని సోదరులు ఆలోచిస్తారు? కొన్ని గిఫ్ట్ ఐడియాలు మీకోసం.

Raksha Bandhan 2023 : రాఖీ రోజు అక్కచెల్లెళ్లకు ఈ బహుమతులు ఇవ్వండి.. వారి కళ్లల్లో ఆనందం చూడండి

Raksha Bandhan 2023

Raksha Bandhan 2023 : రాఖీ పండుగ రోజు ప్రతి ఇల్లు సందడిగా మారిపోతుంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు రక్షాబంధన్ వేడుకగా జరుపుకుంటారు. దూరాన ఉన్నవారు సైతం ఆ రోజు కలుసుకుంటారు. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇస్తారు. ప్రత్యేకమైన రోజు తోబుట్టువులకు ఎలాంటి బహుమతులు ఇస్తే బావుంటుంది?  కొన్నిగిఫ్ట్ ఐడియాలు మీకోసం..

Raksha Bandhan 2023 : బలవంతంగా రాఖీ కట్టొద్దు.. కట్టించుకోవద్దు

మగవారు, ఆడవారు మెచ్చే రకరకాల దుస్తులు ఇప్పుడు మార్కెట్లో, ఆన్ లైన్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. మీ తోబుట్టువులకు ఇష్టమైన దుస్తులు ఆర్డర్ చేయవచ్చు. లేదంటే స్వయంగా కొని బహుమతిగా ఇవ్వచ్చు. ఆడపిల్లలు బంగారం, వెండి అంటే చాలా ఇష్టపడతారు. మీ బడ్జెట్‌ను బట్టి వారికి బంగారం, లేదా వెండి ఆభరణం కొని బహుమతిగా ఇవ్వచ్చు.

మీకు బాగా ఇష్టమైన కొటేషన్, లేదా వారి ఫోటో ప్రింటింగ్‌తో టీ షర్ట్, మగ్, పిల్లో ఇలాంటివి బహుమతిగా ఇచ్చినా ప్రత్యేకంగా అనిపిస్తుంది. వారికి సంతోషాన్ని ఇస్తుంది. ఇక ఆడవారికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే మరీ ఇష్టం. బయటకు వెళ్తే ఖచ్చితంగా వారికి హ్యాండ్ బ్యాగ్ అవసరం ఉంటుంది.  రోజువారి కావాల్సిన వస్తువులన్నీ వారు అందులో పెట్టుకుంటారు. మీ అక్కచెల్లెళ్లకు రాఖీ గిఫ్ట్‌గా హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం గుడ్ గిప్ట్ ఆప్షన్.

Raksha Bandhan 2023 : భర్తకు భార్య రాఖీ కట్టవచ్చునా?

ఇంకా వార్డ్ రోబ్‌లో ఉండటానికి ఇష్టపడే కాస్మెటిక్ హాంపర్‌ను బహుమతిగా ఇవ్వండి. మొక్కలు ఇష్టపడే వారైతే తన రూంలో అలంకరించుకునేలా ఇండోర్ ప్లాంట్ బహుమతిగా ఇవ్వండి.  సెల్ ఫోన్, వాచ్ , హెడ్ ఫోన్స్,  వారికి ఇష్టమైన పుస్తకాలు, ఫ్యాషన్ యాక్ససరీస్ ,ఇష్టమైన పెర్ ఫ్యూమ్. జ్యూయలరీ బాక్స్ ఇలాంటివి కూడా మీ బడ్జెట్‌ను బట్టి  ఓసారి ఆలోచించండి. ఈసారి రాఖీ పండుగను ఆగస్టు 30 న జరుపుకుంటున్నారు. డేట్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఏం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారో త్వరగా ప్లాన్ చేసుకోండి.