Hong Kong : దక్షిణకొరియా మహిళపై లైంగిక వేధింపులు, హాంగ్‌కాంగ్‌లో భారతీయుడు అరెస్ట్

ఏ దేశంలో అయినా మహిళపై వేధింపులు, లైంగిక వేధింపులు ఏమాత్రం తగ్గటంలేదు. విదేశాలు వెళ్లినా తీరు మార్చుకోని కామాంధులు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు.

Hong Kong : దక్షిణకొరియా మహిళపై లైంగిక వేధింపులు, హాంగ్‌కాంగ్‌లో భారతీయుడు అరెస్ట్

Indian man harassing South Korean woman

Updated On : September 13, 2023 / 12:45 PM IST

హాంగ్‌కాంగ్‌లో భారతీయుడని పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళపై భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి లైంగికవేధింపులకు పాల్పడ్డాడు. ఆమె చేయి పట్టుకుని లాగుతు అసభ్యమైన పదాలతో వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె చేయి పట్టుకుని రమ్మంటు అసభ్యంగా ప్రవర్తించాడు. అందంతా ప్రత్యక్ష ప్రసారంలో చేస్తున్న కెమెరాలో రికార్డు అయ్యింది.

ఈ వీడియోలో సెంట్రల్ ఏరియాలోని ట్రామ్ స్టాప్ వద్ద వేచి ఉన్న దక్షిణ కొరియాకు చెందిన మహిళ వద్దకు వచ్చిన భారత్ సంతతికి చెందిన వ్యక్తి ఆమె చేయి పట్టుకుని ‘నేను ఒంటరిగా ఉన్నాను నాతో రా’ అంటూ ఆమెను బలవంతం చేశాడు. ఆమె తన చేయి విడిపించుకోవటానికి తీవ్రంగా యత్నించింది. అయినా అతను వదల్లేదు. ఆమె వదులు అంటూ విడిపించుకోవానికి యత్నించింది. ఆమె తీవ్ర అసౌకర్యానికి గురి అయినట్లుగా ప్రత్యక్షంగా వీడియోలో కనిపించింది.

Lucky spiders : ఆ సాలెపురుగును చూస్తే అదృష్టం .. మహిళకు తగిలిన బంపర్ లాటరీ

వ్లాగర్ అయిన మహిళ హాంకాంగ్ పర్యటనను రికార్డ్ చేస్తుండగా..ఇదంతా ఆమె కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియోలో సదరు వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఆమెను సహాయం కోరుతున్నట్లుగా నటించాడు. కానీ ఆ తరువాత తన నిజస్వరూపాన్ని బటయపెట్టి ఆమెను తనతో రావాలి అంటూ బలవంతం చేయడం ప్రారంభించాడు. “వినండి, వినండి బేబీ, నాతో రండి,” అంటూ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకోవటానికి యత్నించింది.

అయినా ఆమెను వెంటాడాడు. ఆమెను పట్టుకున్నాడు. ఆమె అతడిని దూరంగా తోసేసి అక్కడినుంచి వెళ్లిపోవటానికి యత్నించింది. కానీ అతనువెంటాడి ఆమెను పట్టుకుని ఛాతీపై ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అతడిని తోసివేసి వెళ్లిపోవటానికి పలు రకాలుగా యత్నించింది. కానీ తన మాట వినకపోవటంతో అతను కోపంతో ఆమెను పట్టుకుని గోడకేసి నొక్కి పెట్టి తాను ఒంటరిగా ఉన్నానని తనతో రావాలి అంటూ ఒకటే ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. దీంతో ఆమె సహాయం కోసం పెద్ద పెద్దగా కేకలు వేసింది. దీంతో అతను వదిలేసి పారిపోయాడు.

వ్లాగర్ అయిన మహిళ కెమెరాలో రికార్డు కావటం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అది వైరల్ కావటంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు ప్రబుద్ధుడిని అరెస్ట్ చేశారు. అతను వెయిటర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించాడు. మంగళవారం (సెప్టెంబర్12,2023) పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.