Taiwan :ప్రియుడిపై కోపంతో భవనానికి నిప్పు-46మంది మృతి-మహిళకు జీవిత ఖైదు

ప్రియుడు మోసం చేశాడనే కోపంతో ఒక మహిళ భవనానికి నిప్పంటించింది. ఆ అగ్నిప్రమాదంలో భవనంలో నివసిస్తున్న 46 మంది మరణించారు. ఈకేసులో మహిళకు తైవాన్ కోర్టు జీవితఖైదు విధించింది.

Taiwan :ప్రియుడిపై కోపంతో భవనానికి నిప్పు-46మంది మృతి-మహిళకు జీవిత ఖైదు

Taiwan woman

Taiwan :  ప్రియుడు మోసం చేశాడనే కోపంతో ఒక మహిళ భవనానికి నిప్పంటించింది. ఆ అగ్నిప్రమాదంలో భవనంలో నివసిస్తున్న 46 మంది మరణించారు. ఈకేసులో మహిళకు తైవాన్ కోర్టు జీవితఖైదు విధించింది.

వివరాల్లోకి వెళితే గతేడాది అక్టోబర్ నెలలో చైనాలోని దక్షిణ నగరమైన కాహ్‌సియుంగ్‌లో…. తన ప్రియుడు మోసం చేశాడనే కోపంతో 51 ఏళ్ల ఏళ్ల హువాంగ్ కే కే అనే మహిళ ఒక బహుళ అంతస్తుల భవనానినికి నిప్పంటించింది. అగ్నిప్రమాదంలో భవనంలో నివసిస్తున్న 46 మంది మరణించగా మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈకేసు విచారించిన పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మహిళ తన నేరాన్ని అంగీకరించింది.

ఉద్దేశ్యపూర్వకంగానే ఆమె భవనానికి నిప్పంటించి 46 మంది మృతికి కారణమయ్యిందని ఆమెను ఉరి తీయాలని పులువురు న్యాయవాదులు డిమాండ్ చేసారు. అయితే కోర్టు విచారణలో ఆమెను దోషిగా తేల్చింది. మహిళకు తన ప్రియుడి మీద కోపమే తప్ప భవనంలో నివసించే వారికి నష్టం కలిగించే ఉద్దేశ్యం ఆమెకు లేదని పేర్కోంది. అంతే కాదు ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడలేదని కూడా తేల్చింది.

ప్రియుడు చేసిన మోసం జీర్ణించుకోలేక .. ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పేర్కోంది. మహిళ చేసిన చర్యను ఉద్రేక పూరిత మైన చర్యగా భావించి కోర్టు మహిళకు జీవిత ఖైదు విధించింది.  కోర్టు తీర్పుతో అసంతృప్తి చెందిన న్యాయవాదులు కొందరు పై కోర్టుకు అప్పీలుకు  వెళతామని ప్రకటించారు.