JOBS : కోల్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ , కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎంసీఏ వీటిలో ఏదైనా ఉత్తీర్ణత చెందిన వారై ఉండాలి. గేట్ 2022లో స్కోర్ ఉండాలి.

JOBS : కోల్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

Jobs

JOBS : భారత ప్రభుత్వ బొగ్గుగనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1052 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. విభాగాల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే మైనింగ్ పోస్టులు 699, సివిల్ పోస్టులు 160, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యునికేషన్ పోస్టులు 124, సిస్టమ్ అండ్ ఈడీపీ పోస్టులు 67 ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ , కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎంసీఏ వీటిలో ఏదైనా ఉత్తీర్ణత చెందిన వారై ఉండాలి. గేట్ 2022లో స్కోర్ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జులై 22, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.coalindia.in/ పరిశీలించగలరు.