Indian Cost Guard Jobs : ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.

Indian Cost Guard Jobs : ఇండియన్  కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Indian Cost Guard Jobs

Indian Cost Guard Jobs :  కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్ధులు అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌కు సంబంధించి పోస్టుల వివరాలు దరఖాస్తు ప్రక్రియ, వయస్సు, విద్యార్హతలు ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం ఇలా ఉన్నాయి…..

అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
మొత్తం ఖాళీలు: వెల్లడించలేదు

పోస్టుల వివరాలు:
1. జనరల్ డ్యూటీ (జీడీ)/పైలట్/నావిగేటర్
2. జనరల్ డ్యూటీ (ఉమెన్ – ఎస్ఎస్ఏ)
పై రెండు పోస్టులకు కావల్సిన విద్యార్హతలు: గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: జూలై 1, 1998 తర్వాత పుట్టిన వారై ఉండాలి.

3. కమర్షియల్ ఫైలట్ లైసెన్స్ (స్త్రీ/పురుషులు)
కావల్సిన విద్యార్హతలు : గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే డీజీసీఏ జారీ చేసిన వాలిడ్ కమర్షియల్ ఫైలట్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: జూలై 1, 1998 తర్వాత పుట్టిన వారై ఉండాలి.

4. టెక్నికల్ మెకానికల్ (పురుషులు)
5. టెక్నికల్ (ఎలక్ట్రానికల్/ఎలక్ట్రానిక్స్) (పురుషులు)
ఈ పోస్టులకు కావల్సిన విద్యార్హతలు : సంబంధిత సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: జూలై 1, 1998 తర్వాత పుట్టినవారై ఉండాలి.

6. లా ఎంట్రీ (స్త్రీ/పురుషులు)
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: జూలై 1, 1993 తర్వాత పుట్టిన వారై ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, ఫైనల్ ఎగ్జామ్), మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పై పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 16, 2022
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 26, 2022
పూర్తి సమాచారం కోసం

లో వివరాలు తెలుసుకోండి.