RRCAT JOBS : ఆర్ఆర్ సీఏటీలో పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి సంబంధించి పోస్టులన్ని అనుసరించి సంబంధిత ట్రేడులతోపాటు, ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి.

RRCAT JOBS : ఆర్ఆర్ సీఏటీలో పోస్టుల భర్తీ

Rrcat (1)

RRCAT JOBS : ఇండోర్ లోని రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ (ఆర్ ఆర్ సీఏటీ)లో వివిధ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్లు 29 ఖాళీలు, టెక్నీషియన్లు 21 ఖాళీలు ఉన్నాయి. ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి సంబంధించి పోస్టులన్ని అనుసరించి సంబంధిత ట్రేడులతోపాటు, ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులు ఎంపికకు సంబంధించి రాతపరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 14, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.rrcat.gov.in/సంప్రదించగలరు.