Childhood Obesity : బాల్య ఊబకాయాన్ని ఇలా తగ్గించవచ్చు..

ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం అనేది సాధారణ ప్రమాద కారకంగా మారింది. అందులో బాల్య ఊబకాయం అనేది మరొక తీవ్రమైన సమస్య, దీనికి తక్షణ శ్రద్ధ అవసరం.

Childhood Obesity : బాల్య ఊబకాయాన్ని ఇలా తగ్గించవచ్చు..

Childhood Obesity

Childhood Obesity : ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం అనేది సాధారణ ప్రమాద కారకంగా మారింది. అందులో బాల్య ఊబకాయం అనేది మరొక తీవ్రమైన సమస్య, దీనికి తక్షణ శ్రద్ధ అవసరం. WHO ప్రకారం, 21వ శతాబ్దంలో బాల్య ఊబకాయం అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సవాళ్లలో ఒకటిగా ఉంది, ఇది ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తుంది. కేవలం 40 సంవత్సరాలలో ఊబకాయం ఉన్న పాఠశాల వయస్సు పిల్లల సంఖ్య 10 రెట్లు పెరిగింది, 11 మిలియన్ల నుండి 124 మిలియన్లకు చేరింది.

బాల్య ఊబకాయం పిల్లల శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని WHO పేర్కొంది. ఈ క్రమంలో బాల్య ఊబకాయం ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని.. తల్లిదండ్రులు వారి పిల్లల ఆహారపు అలవాట్ల తోపాటు రోజువారీ దినచర్య, శారీరక శ్రమ, నిద్ర వంటి విషయాలలో శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు.

బాల్య ఊబకాయాన్ని నివారించడానికి డైట్ చిట్కాలు

1. మంచి ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలి
చిన్న వయస్సులోనే పిల్లలు అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ పొందే అవకాశం లేకుండా ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహార అలవాటు ఉండేలా చూసుకోవాలి.

2. పిల్లలకు జంక్ ఫుడ్స్ పరిచయం చేయకూడదు
పిల్లలకు తరచుగా చిప్స్, చాక్లెట్లు, ఫ్రైస్, ఎరేటెడ్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్స్ ను అలవాటు చేయకూడదు. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్, ఆక్సిజనేటెడ్ ఆయిల్స్ తోపాటు మరెన్నో నిండి ఉంటాయి. జంక్ ఫుడ్ తినే అలవాటు ఉన్న పిల్లలు తరచుగా చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటారు.

3. ఆరోగ్యకరమైన అల్పాహారం అలవాటు చేయాలి
వేయించిన ఆహారం తోపాటు తాజా పండ్ల సలాడ్లు, కాయలు, పెరుగు వంటి ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలను అల్పాహారంలో అలవాటు చేయాలి.. ఇది పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీవక్రియను పెంచుతుంది.

4. అయిష్టత చూపించకూడదు
పిల్లలకి ఆహారం ఇచ్చే వ్యక్తి వారిముందు ఏ ఆహారం పట్ల అయిష్టత చూపించకూడదు. ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించకపోతే, పిల్లవాడు ఆ ఆహారాన్ని తిరస్కరించే అవకాశం ఉంది.

5. పిల్లలను అతిగా తిననివ్వవద్దు
తల్లులు తరచుగా పిల్లలను అధికంగా తినేలా ప్రోత్సహిస్తారు. కానీ ఇది అధిక బరువు పెరగడానికి దారితీస్తుంది.

6. తినేటప్పుడు పరధ్యానం / వినోదం మాన్పించాలి
పిల్లలు తినేటప్పుడు టీవీ, మొబైల్ ను తదేకంగా చూడటం సాధారణ పద్ధతిగా మారింది. ఇది చాలా అనారోగ్యకరమైన పద్ధతి. స్క్రీన్‌లను చూడటం వలన పిల్లవాడు పరధ్యానంలో పడతాడు.. దాంతో అవసరమైనదానికంటే తక్కువ లేదా ఎక్కువ తినే అవకాశం ఉంది.. అందువల్ల పిల్లలు భోజనం చేసేటప్పుడు కుటుంబ వాతావరణాన్ని ఆస్వాదించేలా ఏర్పాట్లు చెయ్యాలి.

7. శారీరకశ్రమ ఉండాలి
పిల్లల ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండటానికి రోజుకు కనీసం ఒక గంటపాటు శారీరక శ్రమ కూడా ముఖ్యం. ఈ రోజుల్లో పిల్లలు తెరలకు అతుక్కుంటారు.. దాంతో ఒకేచోట ఉండటం కారణంగా లావు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రతిరోజూ క్రీడలు ఆడటానికి లేదా వ్యాయామం చేసేలా బిడ్డను ప్రోత్సహించాలి. ఇలా చేయడం వలన అవసరమైనంత మేరకే నిద్ర కూడా పడుతుంది.