Pimples : మీ ముఖంపై మొటిమ‌లే చెబుతాయి మీ ఆరోగ్యం గురించి..

మొటిమలు వస్తే కేవలం అందం మాత్రమే పాడైపోతుందని కంగారుపడొద్దు. అలాగని మొటిమలను నిర్లక్ష్యం చేయొద్దు. మొటిమలను చూసి మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చట.మీ ముఖంమీద వచ్చిన మొటిమలు మీ ఆరోగ్యం గురించి చెబుతాయట..ఎక్కడెక్కడ మొటిమలు దేనికి సంకేతమో తెలుసుకోవాలి.

Pimples : మీ ముఖంపై మొటిమ‌లే చెబుతాయి మీ ఆరోగ్యం గురించి..

Pimples

Pimples health problems : ముఖంపై మొటిమలు కనిపిస్తే చాలు అమ్మాయిలు హైరానా పడిపోతారు.అందం పోతుందని దిగులు పడిపోతుంటారు.చాలామంది యువతీ, యువకుల్లో మొటిమలు సర్వసాధారణంగా వస్తుంటాయి. మొటిమలు రావటానికి కారణం అమ్మాయిల్లో ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్ సమతుల్యత (ratio) లోపించడం వలన వస్తుంటాయి. సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలు రావటానికి కారణంగా ఉంటుంది. మొటిమలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.చిన్నగాను, పెద్దగా వస్తుంటాయి.

కానీ మొటిమలను..అవి ఏర్పడిన ప్రాంతాలను బట్టి వారి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చట. ఏ ప్రాంతాల్లో వస్తే ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉంటాయో తెలుస్తుందట. అలా బుగ్గల కింది భాగంలో మొటిమలు ఉంటే నోటిలో ఇన్‌ఫెక్షన్లు, దంత సంబంధ వ్యాధులు ఉన్నాయని తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే బుగ్గలపై కంటి కిందగా మొటిమలు ఉంటే ఊపిరితిత్తులు బాగా పనిచేయడం లేదని తెలుసుకోవాలి. అయితే పొగతాగడం, గాలి కాలుష్యం వంటి వాటి వల్ల కూడా ఇలా అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

నుదుటి భాగంలో మొటిమలు వస్తే మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని అర్థం. అటువంటప్పుడు జంక్‌ఫుడ్ తినటం మానివేస్తే మంచిది. సమస్య పెరగకుండా ఉంటుంది. అలాగే కొవ్వు పదార్థాలు తినకూడదు. శరీరానికి చలువ చేసే చల్లగా ఉండే దోసకాయ, కీరదోస వంటి పదార్థాలను తీసుకుంటే ఫలితం ఉంటుంది. కొద్ది రోజులు ఇలా చేస్తే ఫలితం తెలుస్తుంది. కనుబొమ్మల మధ్యలో మొటిమలు, మచ్చలు వస్తే లివర్ పనితీరు బాగా లేదని అర్థమవుతుంది. ఆల్కహాల్ సేవించే అలవాటు ఉంటే మానివేస్తే మంచిది.లేదంటే నియంత్రణ పాటించాలి. అలాగే పాల ఉత్పత్తులు, పిజ్జా, బర్గర్, చిప్స్ వంటివి మానేసి చూస్తే ఫలితం తెలుస్తుంది.

హార్మోన్ల అసమతుల్యత ఉంటే గడ్డంపై ఏర్పడే మొటిమలు సూచిస్తాయి. ముఖ్యంగా రుతు సంబంధ సమస్యలను ఎదుర్కొనే యువతులు, మహిళల్లో బుగ్గలు, కంటి కిందభాగంలో మొటిమలు వస్తుంటాయి. కొంతమందికి యుక్తవయసు తరువాత కూడా వస్తుంటాయి. వీటి వల్ల ప్రమాదం ఏమి ఉండదని గ్రహించాలి. కొంతమందిలో చిన్న సైజులో వచ్చినా మరికొందరిలో పెద్దగావచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. నొప్పిగా కూడా అనిపిస్తాయి. వాటినుంచి ద్రవం కారుతుంది.అలాగని వాటిని చిదపకూడదు. దురద వస్తే గోకకూడదు. ఉపశమనం కోసం ఏదైనా లేపనం పూస్తే మంచింది. కొంతమందికి శరీరం వేడి చేసినా మొటివలు వస్తాయి. వేడి చేసే పదార్ధాలు తినకుండా ఉంటే మంచిది.ఇంకొందరిలో వారి శరీరానికి సరిపడని ఆహారం తిన్నా వస్తాయి. ఆ ఆహారాలు ఏమిటో గుర్తించి తినటం నియంత్రిస్తే ఉపశమనం కలుగుతుంది.

అలాగే ఛాతి, మెడ భాగాల్లోని మొటిమలు వస్తే ఒత్తిడి ఉన్నట్లుగా తెలుసుకోవాలి. అటువంటి సందర్భాల్లో యోగా, ధ్యానం వంటివి రోజూ చేస్తే ఫలితం కనిపిస్తుంది. ముక్కుపై ఏర్పడే మొటిమలు గుండె పనితీరు, హైబీపీ వంటి రుగ్మతలను తెలియజేస్తాయి. మసాలాలు, కారం ఎక్కువగా వేసి వండిన ఆహారం, కొవ్వు పదార్థాలను వెంటనే మానేసి వాటికి బదులుగా నట్స్‌ను తీసుకోవాలి. అటువంటి ఆహారాలు తీసుకంటే మొటిమ‌ల సమస్య తగ్గుతుంది.

ఇలా ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌ల‌ను బ‌ట్టి మ‌న‌కు ఉన్న అనారోగ్యాల గురించి సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. క‌నుక ఇక‌పై మీరు కూడా ఇలాగే ప‌రిశీలించండి. వ్యాధుల‌ను ముందుగానే తెలుసుకుని జాగ్ర‌త్త పడండి..కానీ మొటిమల వల్ల ఎటువంటి ప్రమాదం లేకపోయినా వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి..