25న ఇంటర్ రీవాల్యూయేషన్ : పని చేయని వెబ్ సైట్ : ఆందోళనలో స్టూడెంట్స్

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 06:16 AM IST
25న ఇంటర్ రీవాల్యూయేషన్ : పని చేయని వెబ్ సైట్ : ఆందోళనలో స్టూడెంట్స్

తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యానికి లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాల్లో తప్పిదాలపై మనోవేదనకు గురవుతున్నారు. ఇంటర్ రీవాల్యూయేషన్ ఏప్రిల్ 25న కావటం మరోపక్క ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్స్ పనిచేయటంలేదు. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన మార్కుల్లో తీవ్ర తప్పిదాలు వెరసి విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. దీంతో నాలుగో రోజు కూడా విద్యార్ధులు తల్లిదండ్రులతో ఇంటర్ బోర్డ్ దగ్గర ఆందోళనకు దిగారు.పోలీసులు కూడా భారీగా మోహరించారు. న్యాయం జరిగేంత వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని తెగేసి చెబుతున్నారు బాధిత విద్యార్థులు. 

ఇంటర్ బోర్డ్ దగ్గర అప్రకటిత కర్ఫ్యూ నెలకొంది. కార్యాలయం సమీపంలోకి విద్యార్ధులు, తల్లిదండ్రులను రాయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తమకున్న అనుమానాలను నివృతి చేయటానికి కూడా ఏ అధికారి కూడా అందుబాటులో లేరని వారు వాపోతున్నారు. 

మరోపక్క ఎంసెట్ లకు ప్రిపేర్ అవుతున్న విద్యార్ధులు ఈ మార్కుల ఆందోళనలో పడి చదవలేకపోతున్నారనీ.. పలు కాంపిటీషన్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులు ఈ ఒత్తిడి గురై మానసికంగా నలిగిపోతున్నారని పేరంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు. ఈ పరిస్థితిలో పిల్లలు ఏమైపోతారోనని ఆందోళన పడుతున్నారని.. పిల్లలు ఏం అఘాయిత్యాలకు పాల్పడతారోనని అనుక్షణం వారికి కాపాడుకుంటున్నామని ఓ విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.