హైదరాబాదీపై కేసు : ముస్లిం డెలివరీ బాయ్‌ తెచ్చిన ఫుడ్ ఆర్డర్ తిరస్కరించాడు

హైదరాబాదీపై కేసు : ముస్లిం డెలివరీ బాయ్‌ తెచ్చిన ఫుడ్ ఆర్డర్ తిరస్కరించాడు

హైదరాబాదీ తన ఫుడ్ డెలివరీ చేసేందుకు ముస్లిం వ్యక్తి వచ్చాడని తిరస్కరించి పోలీస్ కేస్ నమోదయ్యేలా చేసుకున్నాడు. అలియాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి చికెన్ 6ను ఫలక్‌నామాలో ఉన్న స్విగ్గీ ద్వారా గ్రాండ్ బావర్చి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాడు. ఇందులో భాగంగానే ఆన్‌లైన్ పేమెంట్ చేసేశాడు. 

ఆర్డర్ చేసేటప్పుడు ప్రత్యేకంగా తనకు ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి కచ్చితంగా హిందూయే అయి ఉండాలని రాశాడు. ‘చాలా తక్కువ స్పైసీగా ఉండాలి. అంతేకాకుండా దయచేసి డెలివరీ చేయడానికి వచ్చే వ్యక్తి కచ్చితంగా హిందూయే అయి ఉండాలి. డెలివరీ చేసేదానిని బట్టి రేటింగ్ ఇస్తాను’ అని రాశాడు. 

కానీ, స్విగ్గీ యాప్ లో ఆర్డర్ చేయడంతో ఆటోమేటిక్‌గా తర్వాతి వ్యక్తినే డెలివరీకి కేటాయించింది. ఫుడ్ తీసుకువెళ్లేసరికి ఆర్డర్‌ను తిప్పి పంపేశాడు కస్టమర్. డెలివరీ చేసే వ్యక్తి నేరుగా విషయాన్ని ముస్లిం గ్రూపు మజ్లిస్ తెరీక్‌కు తెలియజేశాడు. గ్రూపు ప్రెసిడెంట్ అంజద్ ఉల్లా ఖాన్ కస్టమర్ తిరస్కరించిన స్కీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

స్విగ్గీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో షాలిబండ పోలీస్ స్టేషన్‌‌లో కేసు ఫైల్ చేశారు. ముస్లిం అని ఫుడ్ డెలివరీని తిరస్కరించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నామని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.